పేరాయిగూడెం వాసికి సీఐడీ విభాగంలో ఉద్యోగం | - | Sakshi
Sakshi News home page

పేరాయిగూడెం వాసికి సీఐడీ విభాగంలో ఉద్యోగం

Jul 29 2026 12:40 AM | Updated on Jul 29 2026 12:40 AM

అశ్వారావుపేటరూరల్‌: పోలీస్‌ శాఖలో కీలకమైన సీఐడీ విభాగంలోఅశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధి పేరాయిగూడేనికి చెందిన రిటైర్డ్‌ సింగరేణి ఉద్యోగి కుమారుడు డాక్టర్‌ జుజ్జురపు క్రాంతికుమార్‌ ఉద్యోగం సాధించాడు. సీఐడీ విభాగంలో ఫోరెన్సిక్‌ సైంటిస్టుగా ఎంపికై న ఆయన మంగళవారం డీజీపీ సీవీ ఆనంద్‌ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నాడు. డాక్టర్‌ క్రాంతికుమార్‌ పదో తరగతి వరకు ఇల్లెందులోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో, డిగ్రీ ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ కళాశాలలో పూర్తి చేశాడు. కాకతీయ విశ్వ విద్యాలయంలో ఐఐసీటీ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ) నుంచి పీహెచ్‌డీ అందుకోగా, సీఐడీ విభాగంలో ఉద్యోగానికి ఎంపికై న క్రాంతిని స్థానికులు అభినందించారు.

ఫోరెన్సిక్‌ సైంటిస్ట్‌గా ఎంపికై న క్రాంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement