ఇల్లెందు మండలంలో అత్యధిక విస్తీర్ణంలో మొక్కజొన్న.. ఆ తర్వాత పత్తి, వరి సాగు చేస్తారు. కూరగాయలు, మిర్చి కూడా ఫర్వాలేదనిపించే స్థాయిలో ఉంటుంది. ఎల్‌నినో కారణంగా ఈసారి రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. సుదీర్ఘకాలంగా వరి,మొక్కజొన్న వంటి పంటలు సాగు చేసిన రైతులు ఈ దఫా కంది, పెసర, నువ్వుల సాగుతోపాటు తొలిసారి సోయాబీన్ సాగునుమండలానికి పరిచయం చేశారు. ఏకంగా ఈ పంట వంద ఎకరాలకు విస్తరించడం రైతుల చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
నాగేశ్వరరావు సాగు చేస్తున్న బంతి తోట


