దుమ్ముగూడెం: మండలంలోని పర్ణశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ రైతు పొలంలో వేసిన షెడ్డు దగ్ధమైంది. సోమవారం గ్రామంలో ఓ రైతు తన పొలంలో మంట పెట్టాడు. అవి వ్యాపించి పక్కనే ఉన్న గోసంగి నరసింహా రావుకు చెందిన పొలంలోకి వ్యాపించి, వ్యవసాయ సామగ్రి కోసం నిర్మించిన షెడ్డుకు అంటుకుని దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా అదుపుచేశారు. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు.
బస్సును ఢీకొట్టిన లారీ
అశ్వాపురం: మండలంలోని బీజీ కొత్తూరు సమీ పాన పల్లెవెలుగు బస్సును లారీ ఢీకొట్టింది. సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.. మణుగూ రు నుంచి భద్రాచలం వెళ్తున్న పల్లె వెలుగు బస్సును బీజీ కొత్తూరు – మొండికుంట మధ్య కట్టు కాల్వ సమీపాన వెనుక నుంచి బొగ్గు లారీ ఢీకొట్టింది. లారీడ్రైవర్ మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనం నడపడంతో ఈ ప్రమా దం జరిగిందని తెలి సింది. అదే సమయాన స్తంభాలు తీసుకెళ్తున్న ఓ ట్రాక్టర్‌ను సైతం ఢీకొట్టే క్రమాన ట్రాక్టర్ డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. పోలీసులు చేరుకొని లారీడ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేయగా మద్యం తాగి ఉన్నట్టుతేలడంతో అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద సమయాన బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉండగా, పలువురికి స్వల్పగాయాలే కావడంతో ఊపిరి పీల్చుకోగా, క్షతగాత్రులను భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


