గుండాల: పంటచేన్లలో ప్రమాదవశాత్తు నిప్పు(ఎరుగడి) పడి మొక్కజొన్నచేన్లు, రాసులు పూర్తిగా దగ్ధమైన సంఽఘటన మండలంలో శనివా రం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రోళ్లగడ్డతండా, నర్సాపురంతండా, నర్సాపురం గ్రా మాలకు చెందిన రైతుల చేన్లలో చేతికందిన మొక్కజొన్నను కోయించి కల్లాల్లో ఆరబోశారు. ఈనేపథ్యాన శనివారం ఉదయాన్నే చేన్ల నుంచి మంటలు చెలరేగడంతో స్థానిక రైతులు పరుగులు తీశారు. ఎండ తీవ్రతకు, ఈదురుగాలులకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. దీంతో పురుగుమందులు పిచికారీ ట్యాంకర్లతో మంటలు ఆర్పివేసినా అప్పటికే మొక్కజొన్న పంటతో పాటు, పైపులు, మోటార్లు, వ్యవసాయ పనిముట్లు కాలిపోయాయని రైతులు వాపోయారు. అధికారులు స్పందింది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
నిప్పంటుకొని పండ్ల తోట..
చుంచుపల్లి: లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల శివారులో నిప్పంటుకుని పండ్ల తోట దగ్ధమైంది. వివరాలిలా.. గుగులోత్ రమేష్ బాబుకు చెందిన ఏడెకరాల్లో సాగు చేసిన మామిడి, కొబ్బరి, జామ, సీతాఫలం, తోట పూర్తిగా దగ్ధం అయింది. పక్కనే ఉన్న మొక్కజొన్ని పొలంలో పంట అవశేషాలను కాల్చి వేసే క్రమంలో రైతులు మంట పెట్టడంతో అది భారీ ఎత్తున ఎగిసిపడి పక్క తోటలో ప్రవేశించడంతో తోట మొత్తం దగ్ధమైంది. పంటతో పాటు డ్రిప్ పైప్‌లైన్, పైపులు, పీవీసీ పైప్‌లైన్ పూర్తిగా కాలిపోయాయి. దీంతో దాదాపు రూ.25 లక్షల వరకు ఆస్థి నష్టం జరిగిందని బాధితుడు అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.


