జాగ్రత్తలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

జాగ్రత్తలు తీసుకోవాలి

May 24 2026 12:33 AM | Updated on May 24 2026 12:33 AM

జాగ్రత్తలు తీసుకోవాలి

ఎండల తీవ్రత వల్ల డీహైడ్రేషన్‌ గురై అస్వస్థత సంభవిస్తుంది. వడదెబ్బ తగలకుండా తాగునీరు, కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్‌ ద్రావణాలు, పండ్ల రసాలు, నిమ్మరసం, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. చిన్న పిల్లల విషయంలో మరింగ జాగ్రత్తగా ఉండాలి. ఆరుబయట ఆటలాడుతూ, దాహం వేసినా నీళ్లు తాగకపోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల పదేళ్లలోపు పిల్లలు తేలికగా వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంది. పిల్లలు నీరసంగా కనిపించినా, ఎక్కువ సమయంపాటు పడుకునే ఉంటున్నా, విరేచనాలు, వాంతులు అవుతున్నా డీహైడ్రేషన్‌కు గురైనట్లు భావించాలి. శరీరం వేడిగా ఉంటే చల్లని నీళ్లలో తడిపి పిండిన బట్టతో ఒళ్లు తుడవాలి. చక్కెర, కొద్దిగా ఉప్పు కలిపిన ఓఆర్‌ఎస్‌ తాగించాలి. అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. –డాక్టర్‌ వీరబాబు, పిల్లల వైద్యుడు

Advertisement
 
Advertisement
Advertisement