●ఓబీ కంపెనీ యాజమాన్యంతో కార్మిక సంఘాల ఒప్పందం
మణుగూరు రూరల్: ఓసీలో డంపర్ టైర్ పేలి మృతి చెందిన కార్మికుడు సర్ఫరాజ్ కుటుంబానికి రూ.57లక్షల నష్టపరిహారం చెల్లించేలా ఓబీ కంపెనీ యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య సోమవా రం ఒప్పందం కుదిరింది. సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ఓసీ–2లో ఓబీ వెలికితీత పనులు నిర్వహిస్తున్న వీపీఆర్(దుర్గా) ఓబీ కంపెనీలో ఆది వారం ప్రమాదం జరిగిన విషయం విదితమే. ఒప్పందం ప్రకారం రూ.43లక్షలను నెలరోజుల్లో నేరుగా మృతిడి కుటుంబానికి చెల్లించనుండగా, రూ. 14లక్షల వర్క్ మెన్ కాంపెన్సేషన్ చట్టపరంగా అందజేయనున్నారు. సింగరేణి అఽధికారుల మధ్యవర్తిత్వంలో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీన, ఇఫ్టూనాయకులు ఓబీ కార్మికుల సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. మృ తదేహాన్ని బిహార్‌కు తరలించి, అంత్యక్రియల ఖర్చులు కూడా యాజమాన్యమే చెల్లించనుంది. వీపీఆర్ కాంట్రాక్ట్ కొనసాగినంతకాలం మృతుడి కుటుంబానికి జీతంకూడా చెల్లించేలా ఒప్పందంలో పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు భవి ష్యత్‌లో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవా లని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సింగరేణి అధికారులు ఎం.రమేష్, ఎస్.రమేష్, కె.శ్రీనివాస్, రామేశ్వర్, వంశీ, కిరణ్, కార్మిక సంఘాలనాయకులు వై.రాంగోపాల్, కె.కృష్ణంరాజు, నాసర్‌పాషా, మేకల ఈశ్వర్‌రావు, శనిగరపుకుమారస్వామి, సురేందర్, సిల్వేరు గట్టయ్య, అబ్దుల్ రవూఫ్, మంగీలాల్, జంపన సీతారామరాజు, మధుబాబు, హరి, రవి తదితరులు పాల్గొన్నారు.


