ఆయిల్‌పామ్‌ సాగు మరింత విస్తరణ | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌ సాగు మరింత విస్తరణ

Mar 31 2026 8:38 AM | Updated on Mar 31 2026 8:38 AM

అశ్వారావుపేటరూరల్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రోత్సాహంతో ఆయిల్‌పామ్‌ సాగును మరింత విస్తరించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి తెలిపారు. సోమవారం అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని పామాయిల్‌ ఫ్యాక్టరీలు, ఆయిల్‌పామ్‌ తోటల్లో కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన రైతులు అధ్యయన యాత్రలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా అశ్వారావుపేటలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ సీఎం నియోజకవర్గంలో ప్రతిపాదిత ఆయిల్‌పాం ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై రైతులకు అవగాహన కోసం ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే కల్లూరిగూడెం ఫ్యాక్టరీని పూర్తి చేస్తామని, అశ్వారావుపేటలో కూడా అదనపు ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొడంగల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ వెంకట్‌ రెడ్డి, ఆయిల్‌ఫెడ్‌ ఓఎస్‌డీ అడపా కిరణ్‌కుమార్‌, ఓపీడీ మేనేజర్‌ ప్రవీణ్‌ రెడ్డి, స్థానిక మేనేజర్లు శబావత్‌ శంకర్‌, నాగబాబు పాల్గొన్నారు.

ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement