పాల్వంచ: పాల్వంచలోని శ్రీనివాసగిరిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం నిర్వహించి పదహారు రోజులు పూర్తయిన సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు జరిపారు. ఉత్సవ మూర్తులకు ప్రధాన అర్చకులు తోలేటి నగేష్ శర్మ, అర్చకుడు ఆరుట్ల ఫణిరాజాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, పుష్పాభిషేకం జరిపించారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు. సేవా ట్రస్ట్ చైర్మన్ కొత్త వెంకటేశ్వరరావు, కో చైర్మన్ డాక్టర్ ముక్కంటేశ్వరరావు, అధ్యక్షుడు బిక్కసాని సుధాకర్‌రావు, ఆరుట్ల లక్ష్మణాచా ర్యులు, మధుసూదన్‌రావు, ఊకే భద్రయ్య, తాటికొండ శ్రీలత, నరసింహాకుమార్, లక్ష్మీరెడ్డి, కందుకూరి రామకృష్ణ, బండి నారాయణ, శ్రీనివాసరావు, నరేష్ పాల్గొన్నారు.
దరఖాస్తు గడువు పెంపు
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా షెడ్యూల్డ్ కులా సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక–2025–26 పథకాల నమోదుకు దరఖాస్తు గడువును ఏప్రిల్ 8వ తేది వరకు పొడిగించినట్లు కలెక్టర్ అంకిత్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకు అనుసంధానంతో రవాణా విభాగానికి సంబంధించి ఈవీ ద్విచక్ర వాహనాలు, త్రిచక్రాల గూడ్స్, ప్యాసింజర్ వాహనాలు, పశుసంవర్థక రంగంలో పాడి పశువులు, సోలార్ పంప్‌సెట్ వంటి పథకాలకు అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 98499 05990 నంబరులో సంప్రదించాలని సూచించారు.
స్కాలర్ షిప్ గడువు కూడా..
2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీపోస్ మెట్రిక్ స్కాలర్‌షిప్, రెన్యూవల్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 20వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఎ.శ్రీలత సోమవారం ఒకప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు తెలంగాణ ఈ–పాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2024–25 స్కాలర్‌షిప్‌ల మంజూరుకు ఇంకా ఆధార్ సీడింగ్‌కాని బ్యాంకు అకౌంట్ కలిగిన విద్యార్థులు పోస్టల్ బ్యాంక్ అకౌంట్లు తీసుకోవాలని వివరించారు.
పురాతన నాణేలు లభ్యం
అశ్వాపురం: మండల పరిధిలోని మొండికుంట గ్రామ పంచాయ తీ బీజీ కొత్తూరు గ్రామంలో పొలా న్ని చదును చేస్తుండగా పురాతన నాణేలు లభ్యమైన సంఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఓ రైతు తన పొలంలో జేసీబీతో మట్టి తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నాడు. ఈ క్రమంలో జేసీబీ తగిలి భూమిలో ఉన్న కుండపగిలి పోయి నాణేలు చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో ట్రాక్టర్ల డ్రైవర్లు గుట్టుచప్పుడు కాకుండా వాటిని తీసుకెళ్లి భద్రపరుచుకున్నారు. అనంతరం వారి మధ్య తగాదా జరగడంతో నాణేల విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, స్థానికులు ఏఐ పరిజ్ఞానం ద్వారా అవి 12వ, 13వ శతాబ్దాలనాటి రాగి నాణేలుగా గుర్తించినట్టు సమాచారం. బీజీ కొత్తూరు గ్రామానికి కాకతీ యులు ఉన్న ప్రాంతంగా గుర్తింపు ఉంది. సమీపంలో కాకతీయులు నిర్మించిన తుమ్మలచెరువు, చెరువు సమీపంలో ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఘటనపై పురావస్తుశాఖ అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సంఘటనపై సీఐ అశోక్‌రెడ్డిని వివరణ కోరగా.. ఈ విష యం తమ దృష్టికి వచ్చిందని, వారిని పిలిపించి పరిశీలించగా అవి రాగి నాణేలా లాగా ఉన్నాయని తెలిపారు.


