పాల్వంచ: కేటీపీఎస్ విద్యుత్ కళాభారతి క్రీడా మైదానంలో టీజీ జెన్‌కో ఇంటర్ ప్రాజెక్ట్స్ ఫుట్‌బాల్, కల్చరల్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. కేటీపీఎస్ 5,6,7 దశలు, బీటీపీఎస్, పులిచింతల, సింగూర్, విద్యుత్ సౌధ, కేటీపీపీ కర్మాగారాల క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. పోటీలను సీఈలు ఎం.ప్రభాకర్ రావు, జె.సూర్యనారాయణ ప్రారంభించి మాట్లాడారు. క్రీడా స్ఫూర్తి చాటాలని సూచించారు. ఎస్‌ఈ మోక్షవీర్, డిప్యూటీ స్పోర్ట్స్ ఆఫీసర్ రామారావు, స్పోర్ట్స్ సెక్రటరీలు వీరస్వామి, మహేష్, జమీల్, అరుణ్, బాబి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


