ప్రజామోదితంగా ఉండాలి
అంకెల గారడీ
తొలి భేటీలోనే బయటపడిన అవగాహన రాహిత్యం
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తొలి పాలకవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ మూడ్ గణేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించగా, బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.140.71 కోట్ల ఆదాయం, రూ.159.60కోట్ల వ్యయంతో అంచనా బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, పాలకవర్గం ఆమోదించింది. జీతా లు, పొరుగు సేవల ఉద్యోగుల వేతనాలు, పారిశుద్ధ్య నిర్వహణ, కరెంట్ బిల్లులు, రుణ వాయిదాల చెల్లింపులు, పట్టణ ప్రగతి నిధులు, 15వ ఆర్ధిక సంఘం నిధులు, పార్కులు, అభివృద్ధి పనులు, ప్రజా మరుగుదొడ్లు, జంతు వధశాలలు, డంపింగ్ యార్డుల నిర్మాణాలకు కేటాయింపులను కూడా బడ్జెట్‌లో పొందుపరిచారు. అయితే బడ్జెట్‌లో ఆదా యం రూ.140.71కోట్లుగా, ఖర్చు రూ.159.60 కోట్లు చూపి, మిగులు ఆదాయం రూ.68 లక్షలుగా పేర్కొనడం గమనార్హం.
బడ్జెట్ ప్రజామోదితంగా ఉండాలి. మురికివాడల్లోని ప్రజల జీవనం ప్రమాణస్థాయిని పెంచేలా ఉండాలి. కార్పొరేషన్ వ్యాప్తంగా కమర్షి యల్, నాన్ కమర్షియల్ నుంచి వచ్చే ఆదాయ పద్దులు వివరించాలి. కానీ ఈ బడ్జెట్ అంకెల గారడీ, ఊహాజనిత బడ్జెట్‌గా ఉంది.
– మునిగడప పద్మ,
సీపీఐ కార్పొరేటర్
కార్పొరేషన్ బడ్జెట్ అంకెల గారడీతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం.నగర వాసులకు ఒరిగేదేమీ లేదు. బడ్జెట్‌లో పేర్కొన నిధులు ఎలా సమకూరుతాయో స్పష్టత లేకపోవడం పెద్ద లోపం. రూపకల్పనలో అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారు.
– సీతాలక్ష్మి,
మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్
కొత్తగూడెం కార్పొరేషన్ తొలి సర్వసభ్య సమావేశంలో అధికారుల అవగాహన రాహిత్యం బయటపడింది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వర కు నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో వచ్చే ఆదా యం, ఖర్చులు,వేతనాలు, కార్యాలయం, వాహనా ల నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించా ల్సిన నిధులు,రావాల్సిన పన్నులపై చర్చలు జరపా ల్సి ఉంది. కానీ గ్రేడ్–2 మున్సిపాలిటీకి కమిషనర్‌గా వ్యవహరించిన అధికారి, ఇతర అధికారులు ఫ్లెక్సీలు,పారిశుద్ధ్య అంశాలను చర్చించడంతో పలు వురు అధికారులు, పాలకవర్గ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం అనంతరం జరిగి న సర్వసభ్య సమావేశం ఎజెండాలోని 19 అంశాల పై చర్చ జరపాల్సిన వారు, అది పక్కన పెట్టి బడ్జెట్ లెక్కలు గుర్తుకు వచ్చి వాటిపై మాట్లాడారని కొందరు కార్పొరేటర్లు తెలిపారు. అయితే ఏ సమస్యపై మాట్లాడినా మేయర్, కమిషనర్ దాటవేసే ధోరణితోనే వ్యవహరించాని పేర్కొన్నారు. కాగా సమావేశం రాత్రి వరకు కొనసాగింది.


