బూర్గంపాడు: గంజాయి అక్రమ రవాణా, విక్రయాల్లో ఐదు కేసుల్లో నిందితుడిగా ఉన్న సారపాకకు చెందిన షేక్ మున్వర్‌పై పోలీసులు పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. ఇతనిపై బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌లో రెండు, లక్ష్మీదేవిపల్లి, ఏడూళ్ల బయ్యారం, దుండిగల్ పోలీస్‌స్టేషన్లలో ఒక్కోటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఎస్పీ రోహిత్‌రాజు పర్యవేక్షణలో ఆధారాలను పరిశీలించిన పీడీ యాక్ట్‌ను నమోదు చేశారు. సోమవారం నిందితుడు మున్వర్‌కు పీడీ యాక్ట్‌కు సంబంధించిన నిర్బంధ ఉత్తర్వులను పాల్వంచ సీఐ సతీష్ అందజేశారు. ఏడాది కాలంపాటు చర్లపల్లి జైలు నిర్బంధించాలని ఉత్వరుల్లో పేర్కొన్నారు.


