అశ్వారావుపేటరూరల్: దాడికి పాల్పడిన ఇద్దరిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని కావడిగుండ్లలో అక్రమంగా గొదాములు నిర్మించి, అనుమతి లేకుండా పత్తి కొనుగోలు చేస్తున్నట్లు దళారిపై కొద్ది రోజుల క్రితం ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన గుబ్బల సత్యనారాయణ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. బుధవారం అశ్వారావుపేట ఆర్‌ఐ, వీఆర్‌ఓలు విచారణ చేస్తున్న క్రమంలో స్థానిక సర్పంచ్ బాడిస లక్ష్మణ్‌రావు, ఎంపీటీపీ మాజీ సభ్యుడు వాసం బుచ్చిరాజు కలిసి దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యయాతిరాజు తెలిపారు.
అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత
బూర్గంపాడు: పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాన్ని బుధవారం పోలీసులు పట్టుకున్నారు. భద్రాచలం వైపు నుంచి పాల్వంచ వైపునకు వెళ్తున్న వాహనాన్ని సారపాక వద్ద పోలీసులు పట్టుకుని, అందులోని 9 పశువులను పాల్వంచ అన్నపూర్ణ గోసంరక్షణ సమితికి అప్పగించారు. ఐదు ఎద్దుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు గోసంరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి ఆంజనేయశర్మ తెలిపారు. పశువుల అక్రమ రవాణా బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


