సూపర్‌బజార్(కొత్తగూడెం): భూసమస్యపై అశ్వారావుపేట మండలం రామన్నగూడెం ఆది వాసీలు 9 రోజు లుగా నిర్వహిస్తున్న ఆత్మగౌర వ నిరవధిక నిరాహార దీక్షలకు బుధవారం విరమించారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ తన చాంబర్‌లో ఆదివాసీ ప్రతినిధులతో నిర్వహించిన చర్చలు ఫలించాయి. పట్టాదారులుగా ఉన్నవారికి సర్వే నిర్వహించి న్యా యం చేస్తామని, ముత్తాతల కాలం నుంచి సాగులో ఉన్న వారికి పారదర్శకతతో విచారణ జరిపి నిబంధనలకు అనుగుణంగా సాగుకు అవకాశం కల్పిస్తామని, అటవీ భూములకు సంబంధించి చట్టపరంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, అధికారుల హామీ తో దీక్ష విరమించామని, న్యాయం జరగకపోతే తిరిగి ఉద్యమం చేపడతామని సర్పంచ్ మడకం నాగేశ్వరరావు తెలిపారు. చర్చలలో కొత్తగూడెం ఆర్డీఓ మధు, జిల్లా అటవీశాఖాధికారి కృష్ణగౌడ్, పాల్వంచ డీఎస్పీ సతీష్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


