ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రిలో మందుల కొరత | - | Sakshi
Sakshi News home page

ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రిలో మందుల కొరత

Mar 26 2026 7:43 AM | Updated on Mar 26 2026 7:43 AM

ఇల్లెందు: సర్కార్‌ దవా ఖానకు వచ్చే పేద రోగు లను మందుల కొరత పీడిస్తోంది. డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే ఇన్సులిన్‌ ఇంజక్షన్‌తో పాటు గ్యాస్‌ సమస్యతో బాధపడే రోగులకు ఇచ్చే పాన్‌టాబ్‌ ఇంజక్షన్‌లు లేకరోగులు బయట కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. బుధవారం ఇల్లెందు ఏరియా వైద్యశాలను డీసీహెచ్‌ఎస్‌ రవిబాబు తనిఖీ చేయగా ఈవిషయాన్ని గుర్తించారు. అన్నివార్డులను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జ్వర పీడితుల సంఖ్య ఎక్కువగా ఉందని, వేసవి దృష్ట్యా హీట్‌ ఫీవర్స్‌, టైఫాయిడ్‌ జ్వరాలు అధికంగా ఉన్నందున ప్రతీ ఒక్కరు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. రోగుల కోసం ప్రత్యేక షెడ్‌ను నిర్మించడం కోసం నిధులు ఉన్నా కాంట్రాక్టర్‌లు ముందుకు రావటంలేదని, అంబులెన్సులు లేకపోవటంవల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యులు డీసీహెచ్‌ఎస్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. డీసీహెచ్‌ఎస్‌ వెంట సూపరింటెండెంట్‌ హర్షవర్దన్‌, వైద్యులు శేఖర్‌, బన్సీ, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ ఫర్జానా ఉన్నారు. ఈ సందర్భంగా వైద్యశాలలో కాన్పుపొందిన ఫార్మాసిస్ట్‌ రజినిని అభినందించారు.

గంజాయి సేవిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రశాంతినగర్‌ సమ్మక్క–సారక్క గద్దెల సమీపంలో గంజాయి సేవిస్తున్నారనే సమాచారం మేరకు బుధవారం టూటౌన్‌ పోలీసులు దాడినిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి.. టూటౌన్‌ సీఐ ప్రతాప్‌ ఆదేశాల మేరకు ఎస్‌ఐ మనీషా, హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటేశ్వ ర్లు, కానిస్టేబుళ్లు రాజా, ప్రశాంత్‌, వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని, పరారయ్యేందుకు యత్నించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 95 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను షేక్‌ జానీపాషా, బోడ విష్ణువర్దన్‌గా గుర్తించి, కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement