త్వరలో గిరిజన మార్ట్ ఏర్పాటు
● ఐటీడీఏ ఏపీఓ జనరల్
భద్రాచలం: గిరిజనులకు ఆహార ఉత్పత్తులు ఒకేచోట విక్రయించేలా గిరిజన మార్ట్‌ను భద్రాచలంలో త్వరలో ఏర్పాటు చేస్తామని, రైతుల పంటల వివరాలను త్వరగా అందించాలని ఐటీడీఏ ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. మంగళవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో జీసీసీ మేనేజర్లు, సేల్స్‌మేన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఆర్ డిపో పరిధిలోని గ్రామాల్లో పంటల వివరాలు, ఉత్పత్తి, అటవీ ఫలాల వివరాలను అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, సమ్మయ్య, వేణు, జయరాజు, భూషయ్య, లక్ష్మణ్, పాపారావు, సిబ్బంది పాల్గొన్నారు.
మూడు విడతలుగా
తునికాకు టెండర్ల ప్రక్రియ
పాల్వంచరూరల్:అటవీ అధికారులు తునికాకు సేకరణ టెండర్ల ప్రక్రియ చేపట్టారు. తునికాకు సేకరణ కోసం తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్ధ గతేడాది కంటే ఈసారి ముందుస్తుగానే టెండర్ల షెడ్యూల్ విడుదల చేసింది. తునికాకు మొదటి సేల్ టెండర్లు ఈనెల 16 నుంచి 23 వరకు నిర్వహించగా, రెండో సేల్ టెండర్ల ప్రక్రియ 29 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు, మూడో సేల్ టెండర్లు 9 నుంచి 13వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్నట్లు డీఎం తెలిపారు. కాగా జిల్లాలోని ఆరు డివిజన్ల పరిధిలోని 39 యూనిట్లలో గతేడాది ఆలస్యంగా తునికాకు టెండర్లు నిర్వహించినా కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. కానీ ఖమ్మం జిల్లాలో ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోలేదు.
కొనసాగుతున్న ఉమెన్ టీ–20 క్రికెట్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఇందిరాగాంధీ సీనియర్ మహిళల టీ–20 క్రికెట్ టోర్నీ కొనసాగుతోంది. మూడో రోజు పోటీల్లో భాగంగా మహారాష్ట్ర – ఆంధ్రప్రదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరగగా తొలుత బ్యా టింగ్ చేసిన మహరాష్ట్ర నిర్ణీత ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 197 పరుగులు చేసింది. జట్టులో మిథాలీ శర్మ 96 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 116 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించడం విశేషం. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రప్రదేశ్ జట్లు 29 ఓవర్లలో 128 పరుగులే చేయడంతో ఓటమి పాలైంది. ఉత్తరాఖండ్ – ఉత్తరప్రదేశ్ మధ్య మ్యాచ్‌లో ఉత్తరాఖాండ్, విదర్భ – ఆంధ్రప్రదేశ్ జట్ల మధ్య మ్యాచ్‌లో విదర్భ జట్టు గెలుపొందింది. ఈ మ్యాచ్‌లను మాజీ మిస్ ఇండియా డాక్టర్ పర్హా ప్రారంభించగా, బ్యాంక్ మేనేజర్ శివకుమార్‌తో పాటు ఎం.డీ.మతిన్, జానీ, జోజిచాకో తదితరులు పాల్గొన్నారు.
అప్పుల బాధతో
రైతు ఆత్మహత్య
తిరుమలాయపాలెం: వ్యవసాయంలో నష్టాలు ఎదురై అప్పులు పెరగడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని జూపెడ గ్రామానికి చెందిన దమ్మాలపాటి వెంకన్న(55) తనకు ఉన్న 20కుంటల భూమితో పాటు మూడెకరాలు కౌలుకు తీసుకుని వివిధపంటలు సాగు చేశాడు. అయితే, సరైన దిగుబడి అప్పులు మిగలడంతో తీర్చేమార్గం లేదక సోమవారం ఆయన పంట చేను వద్దే పురుగుల మందు తాగాడు. కాసేపటికి గుర్తించిన కుటుంబీకులు ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తుండగా మంగళవారం మృతిచెందా డు. ఘటనపై వెంకన్న కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కూసుమంచి: మండలంలోని పోచారం గ్రామానికి చెందిన రెడ్డిమళ్ల ప్రశాంత్(26) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మంలో మెకానిక్‌గా పనిచేసే ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయాన సోమవారం బలవర్మరణానికి పాల్ప డ్డాడు. ఘటనపై ఆయన తండ్రి ఫిర్యాదుతో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. కాగా, ప్రశాంత్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.
త్వరలో గిరిజన మార్ట్ ఏర్పాటు


