‘ఓటు’పై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

‘ఓటు’పై అవగాహన కల్పించాలి

Jan 26 2026 4:45 AM | Updated on Jan 26 2026 4:45 AM

‘ఓటు’పై అవగాహన కల్పించాలి

‘ఓటు’పై అవగాహన కల్పించాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రజలు, ముఖ్యంగా యువతకు ఓటు హక్కు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కలెక్టరేట్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. బీఎల్‌ఓలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. బూత్‌ లెవల్‌ అధికారులకు కిట్లను పంపిణీ చేశారు. ఉత్తమ ఎలక్టోరల్‌ అధికారులుగా ఎంపికై న తహసీల్దార్లు, మాస్టర్‌ ట్రైనర్‌కు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందించారు. వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్లను ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలందరి భాగస్వామ్యం ఉండాలని అన్నారు. అనంతరం ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేశారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నూతన ఓటర్లతో నిర్వహించిన సైకిల్‌ ర్యాలీని కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌లో కలెక్టర్‌ ప్రారంభించారు. కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌ నుంచి ప్రారంభమైన సైకిల్‌ ర్యాలీ రైల్వే స్టేషన్‌ వరకు సాగింది. ఈ కార్యక్రమాల్లో కొత్తగూడెం ఆర్డీఓ మధు, జిల్లా యువజన, క్రీడ శాఖాధికారి పరంధామ రెడ్డి, ఎన్నికల సూపరింటెండెంట్‌ రంగ ప్రసాద్‌, తహసీల్దార్లు పుల్లయ్య, దారా ప్రసాద్‌, ఎన్నికల మాస్టర్‌ ట్రైనర్‌ పూసపాటి సాయికృష్ణ, సిబ్బంది నవీన్‌ పాల్గొన్నారు.

సమ్మిట్‌ ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలి

భద్రాచలంటౌన్‌: ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న ‘సీఎస్‌ఆర్‌ సమ్మిట్‌’ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులను ఆదేశించారు. భద్రాచలంలోని గిరిజన భవనాన్ని ఆదివారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సమ్మిట్‌లో మారుమూల ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, గిరిజనుల స్థితిగతులపై చర్చించనున్నట్లు తెలిపారు. తక్కువ పెట్టుబడితో లభించే బయోచ్చార్‌, ఇటుకల తయారీ, చేపల పెంపకం వంటి స్వయం ఉపాధి యూనిట్లపై బృంద సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా స్టాళ్లు ఏర్పాట్లు చేయాలన్నారు. సోమవారం సాయంత్రం నాటికి అన్ని పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఓ సంజీవరావు, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ కీర్తి, ఏపీఎం త్రిగుణ, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement