గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌లే కీలకం
చుంచుపల్లి: గ్రామాల సమగ్రాభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకమని, ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నా రు. ఇటీవల ఎన్నికై న సర్పంచ్‌లకు కొత్తగూడెంలోని మన్మోహన్‌సింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సోమవారం ఏర్పాటుచేసిన శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో 468మంది సర్పంచ్‌ల్లో మొదటి బ్యాచ్ వారికి ఈనెల 19నుంచి 23 వరకు, రెండో బ్యాచ్‌కు ఫిబ్రవరి 3 నుంచి 7వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని, గ్రామ పాలన, పరిపాలనా విధానాలపై సమగ్ర అవగాహ న కల్పించడమే లక్ష్యమని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామపంచాయతీలకు అందే వివిధ అభివృద్ధి పథకాల నిధులను సక్రమంగా వినియోగించాలని, ప్రజల మౌలిక అవసరాలైన తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్యుత్, ఆరోగ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులపై నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అక్షరాస్య త పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. జిల్లాలో అనేక అందమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నా సరైన ప్రచారం లేక అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయని, ప్రతీ సర్పంచ్ తమ గ్రామాల్లోని పర్యాటక ప్రదేశాలు, సహజ వనరులు, విశిష్టతలను విస్తృతంగా ప్రచారం చేస్తే అవి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతాయని, తద్వారా గ్రామాల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని చెప్పా రు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ సుధీర్‌కుమార్, ట్రెయినీ డీపీఓ అనూష, డీఎల్పీఓలు ప్రభాకర్, రమణ, టీజీఐఆర్టీ సెంటర్ హెడ్ సుభాష్ చంద్రగౌడ్, ట్రైనర్లు ధన్‌సింగ్, రవీందర్‌రెడ్డి, సునీల్ కుమార్, ముత్యాలరావు, సందీప్, అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి. పాటిల్


