వాతావరణ ం
గరిష్టం / కనిష్టం
330 / 160
గణన ఎంతో కీలకం
నేటి నుంచి 25 వరకు
వన్యప్రాణుల లెక్కింపు
సర్వేలో 754 మంది అటవీ
ఉద్యోగులు, 65 మంది వలంటీర్లు
జిల్లాలో మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయి. రాత్రి వేళ వాతావరణం చల్లబడుతుంది.
గణనకు సన్నద్ధం
పాల్వంచరూరల్: వన్యప్రాణుల గణనకు అటవీ శాఖ సన్నద్ధమవుతోంది. మంగళవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు లెక్కింపు ప్రక్రియ సాగనుండగా 377 బీట్ల పరిధిలో 819 విధులు నిర్వర్తించనున్నారు. పాల్వంచ వైల్డ్‌లైఫ్ డివిజన్ పరిధిలో 74 బీట్లు, పాల్వంచడివిజన్ పరిధిలో 116, కొత్తగూడెం డివిజన్‌లో 60, ఇల్లెందు డివిజన్‌లో 99, మణుగూరులో 90, భద్రాచలం డివిజన్‌లో 53బీట్లలో రోజు కు ఐదు కిలోమీటర్ల పరిధిలో సర్వే చేయనున్నారు. జిల్లా అటవీ ప్రాంతాల్లో శాకాహార జంతువులు ఎన్ని, మాంసాహార జంతువులు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చనున్నారు. 754మంది అటవీ ఉద్యోగులతో పాటు 65 మంది వలంటీర్లతో ఈ ప్రక్రియ కొనసాగనుంది. ప్రతీ బీట్‌లో ఐదు నుంచి పది మీటర్ల వెడల్పు వరకు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసుకుని గణన కొనసాగిస్తారు.
ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు..
వన్యప్రాణుల పాద ముద్రలు, వెంట్రుకలు, పెంటికలు తదితర గుర్తులను సేకరించిన సిబ్బంది ఆలిండియా టైగర్స్ ఎస్టిమేషన్ యాప్‌లో నమోదు చేశాక ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. సర్వే నిర్వహించే సిబ్బందికి ప్రత్యేకంగా టీషర్టులు, క్యాప్‌లు, పేపర్, పెన్ను, జిప్‌లాక్ (ఆనవాళ్ల సేకరణకు ఉపయోగించే పదార్థం) కలిగిన కిట్ బ్యాగ్‌లను ఎఫ్‌డీఓ బి.బాబు సోమవారం పంపిణీ చేశారు.
చుంచుపల్లి: ఆలిండియా టైగర్ ఎస్టిమేట్ – 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పులుల గణనకోసం శిక్షణను విజయవంతంగా నిర్వహిం చామని జిల్లా అటవీశాఖ అధికారి జి.కిష్టాగౌడ్ తెలిపారు. సోమవారం కొత్తగూడెంలో పులుల గణన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడా రు. నేటి నుంచి 25 వరకు ఫీల్డ్ సర్వే నిర్వహించనున్నట్లు చెప్పారు. పులుల సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణలో ఈ గణన కీలకమన్నారు. శాసీ్త్ర య పద్ధతుల్లో సర్వే నిర్వహించడం ద్వారా పులు ల సంఖ్య, నివాస ప్రాంతాలు, కదలికలపై కచ్చి తమైన సమాచారం లభిస్తుందని తెలిపారు. ఈ సర్వేలో ప్రతీ బీట్‌కు ఇద్దరు సిబ్బంది ఉంటారని, ఎఫ్‌డీఓలు, ఎఫ్‌ఆర్‌ఓలు, డిప్యూటీ రేంజ్ అధికా రులు, అటవీ సెక్షన్ అధికారులు సర్వేను పర్యవేక్షిస్తారని చెప్పారు. సర్వే పూర్తయ్యాక ఆ డేటాను ‘ఎం – స్ట్రైప్స్ యాప్’ ద్వారా అప్‌లోడ్ చేసి విశ్లేషణకు వినియోగించనున్నట్లు తెలిపారు.


