సంక్షేమ పథకాలు గిరిజనులకు చేరాలి
భద్రాచలం: ప్రభుత్వం అందచేసే ప్రతీ సంక్షేమ పథకం గిరిజనుల చెంతకు చేరేలా యూనిట్ అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వినతులను పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, అర్హతల మేరకు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, అధికారులు మధుకర్, సున్నం రాంబాబు, లక్ష్మీనారాయణ, హరికృష్ణ, హేమంత్ పాల్గొన్నారు.
అందుబాటులో టీజీటీ తాత్కాలిక జాబితా..
తెలంగాణ గిరిజన గురుకుల, ఏకలవ్య మోడల్ విద్యాలయాల్లో టీజీటీ ఇంగ్లిష్, లైబ్రేరియన్ ఔట్ సోర్సింగ్ పోస్టుల నియామక తాత్కాలిక మెరిట్ జాబితాను అందుబాటులో ఉంచినట్లు పీఓ రాహుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల నుంచి 22 వరకు ఐటీడీఏ నోటీస్ బోర్డులో ఉంచుతామని, ఏమైనా అభ్యంతరాలుంటే కార్యాలయ పని వేళల్లో సమర్పించాలని కోరారు.
ఐటీడీఏ పీఓ రాహుల్


