● అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తం ● జిల్లాలో 250 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

● అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తం ● జిల్లాలో 250 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు

Dec 3 2025 7:33 AM | Updated on Dec 3 2025 7:33 AM

● అవా

● అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తం ● జిల్లాలో 250 సమస్

● అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తం ● జిల్లాలో 250 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు

టేకులపల్లి : గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. గెలుపే లక్ష్యంగా వివిధ పార్టీల నాయకులు, స్వతంత్రులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు కలిసి మెలిసి ఉన్న వారు గ్రూపులుగా విడిపోయి ప్రచారం చేయడంతో గొడవలకు ఆవకాశం ఉంది. దీంతో పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. జిల్లాలో 471 గ్రామ పంచాయతీలు, 4,168 వార్డులు ఉన్నాయి. ఒక్కో వార్డుకు ఒక్కో పోలింగ్‌ కేంద్రం చొప్పున 4,168 వార్డులకు 4,242 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో గత ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక కేంద్రాలుగా 87, అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా 163.. మొత్తం 250 పోలింగ్‌ స్టేషన్లను గుర్తించారు. ఆళ్లపల్లి మండలంలో 12, గుండాలలో 11, బూర్గంపాడులో 10, అశ్వాపురంలో 9, కరకగూడెంలో 16, మణుగూరులో 5, పినపాకలో 5, టేకులపల్లిలో 15, ఇల్లెందులో 26, లక్ష్మీదేవిపల్లిలో 17, చుంచుపల్లిలో 4, పాల్వంచలో 8, సుజాతనగర్‌లో 5, అశ్వారావుపేటలో 9, దమ్మపేటలో 8, ములకలపల్లిలో 4, అన్నపురెడ్డిపల్లిలో 7, చండ్రుగొండలో 9, దుమ్ముగూడెంలో 37, చర్లలో 26, జూలూరుపాడు మండలంలో 7 ఉన్నాయి.

అతిక్రమిస్తే జైలుకే..

సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటుచేస్తున్నారు. నాయకుల ప్రచార సరళిపై దృష్టి సారించారు. పోలింగ్‌ సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అవసరమైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా కేంద్రాల వద్ద పోలీసు బలగాల సంఖ్య పెంచనున్నారు. సర్పంచ్‌, వార్డు స్థానాలకు నిబంధనలకు విరుద్ధంగా వేలం నిర్వహించడంతో పాటు బలవంతంగా ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నించే వారిపై కేసులు నమోదు చేస్తారు. గత ఎన్నికల్లో సమస్యలు సృష్టించిన వారిని, అనుమానితులను బైండోవర్‌ చేస్తున్నారు. రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.

● అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తం ● జిల్లాలో 250 సమస్1
1/1

● అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తం ● జిల్లాలో 250 సమస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement