విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి

Dec 1 2025 8:43 AM | Updated on Dec 1 2025 8:43 AM

విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి

విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి

భద్రాచలంటౌన్‌ : ఉన్నతస్థాయికి, శాస్త్రవేత్తలుగా ఎదిగేలా గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను తీర్చిదిద్దాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ అన్నారు. పట్టణంలోని బీఈడీ కళాశాలలో ఉపాధ్యాయులు, పీఈటీలకు జరుగుతున్న కెపాసిటీ బిల్డింగ్‌ శిక్షణ కార్యక్రమం ఆదివారం ముగిసింది. తొలుత 15 రోజులుగా శిక్షణ తీసుకున్న గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు, డీఆర్‌పీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాలు విద్యా, అభ్యాసన సామర్థ్యాలు మెరుగుపరచుకునేందుకు, మెరుగైన బోధనకు ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థుల్లో గణితం పట్ల భయం పోగొట్టాలని చెప్పారు. విద్యార్థుల్లో స్వతహాగా ఆలోచించే విధానాన్ని పెంపొందించాలని సూచించారు. అధికారులు అశోక్‌, వీరూ నాయక్‌, రమేష్‌, మోతిలాల్‌ పాల్గొన్నారు.

ఐటీడీఏ పీఓ రాహుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement