 
															గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా
మణుగూరు టౌన్: గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న లారీ మణుగూరు శివారులో గురువారం తెల్లవారుజామున బోల్తా పడింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో లారీ విజయవాడ నుంచి ఏటూరునాగారం వైపు వెళ్తోంది. ఈ క్రమంలో మణుగూరు శివారు సాయినగర్ సమీపంలో డివైడర్ ఎక్కి వాహనం బోల్తా పడింది. స్థానికుడు గమనించి డ్రైవర్‌ను కేబిన్ నుంచి బయటకు తీయగా ప్రమాదం తప్పింది. లారీలో 340 సిలిండర్లు ఉన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సిలిండర్లను మరో లారీలో ఎక్కించారు. రోడ్డుపై నుంచి లారీని తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చేశారు. కాగా ఒక్క సిలిండర్ లీకై నా పెను ప్రమాదం సంభవించి ఉండేదని స్థానికులు పేర్కొన్నారు.
రెండు నెలల వ్యవధిలో మూడు ప్రమాదాలు
కొత్తగూడెం– ఏటూరునాగారం మార్గంలో నెలలు తరబడి డివైడర్ పనులు సాగుతున్నాయి. నిర్మాణాల వద్ద వీధిలైట్లు, స్టాపర్లు, రేడియం స్టిక్కర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో రెండు నెలల వ్యవధిలో మూడు ప్రమాదాలు జరిగాయి. ఇటీవల ఓ లారీ రాత్రివేళ డివైడర్‌ను ఎక్కి ప్రమాదానికి గురైంది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మరమ్మతులకు గురైన గుంతల్లో పడి అదే ప్రదేశంలో తీవ్రగాయాలపాలయ్యాడు. తాజాగా గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా పడింది. అధికారులు స్పందించి వీధిలైట్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
త్రుటిలో తప్పిన ప్రమాదం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
