 
															పోలీస్ అమరులను స్మరించుకోవాలి
కొత్తగూడెంఅర్బన్: పోలీసు అమరవీరులను స్మరించుకోవడం అందరి బాధ్యత అని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో త్రీటౌన్ పోలీసు స్టేషన్‌లో గురువారం ఆన్‌లైన్ ఓపెన్ హౌస్ నిర్వహించారు. అందుబాటులో ఉన్న స్కూళ్ల విద్యార్థులు స్వయంగా ఓపెన్ హౌస్‌ను సందర్శించారు. పోలీసు వ్యవస్థ పనితీరు, విధి నిర్వహణలో ఉపయోగించే వివిధ పరికరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డాగ్ స్క్వాడ్, స్మోక్ గన్, షెల్స్, బాంబు నిర్వీర్య విభాగం పని విధానాన్ని వివరించారు. సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. సీఐలు వెంకటేశ్వర్లు, శివప్రసాద్, కరుణాకర్, ఆర్‌ఐ లాల్ బాబు, ఎస్సైలు అరుణ, రమాదేవి పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
