 
															పులుల గణన పక్కాగా నిర్వహించాలి
● డీఎఫ్‌ఓ కృష్ణా గౌడ్
పాల్వంచరూరల్: పులుల గణనను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా అటవీశాఖాధికారి కృష్ణాగౌడ్ సూచించారు. మండల పరిధిలోని కిన్నెరసాని డీర్‌పార్కు వద్ద 100 మంది వైల్డ్‌లైఫ్ సిబ్బందికి, టెరిటోరియల్ పాల్వంచ డివిజన్‌లోని 100మంది ఫారెస్ట్ సిబ్బందికి సోములగూడెం రోడ్డులోని అర్బన్ పార్కులో గురువారం శిక్షణ ఇచ్చారు. అమ్రాబాద్ నుంచి వచ్చిన వైల్డ్‌లైఫ్ నిపుణులు మహేందర్‌రెడ్డి, రమాకాంత్ పులుల గణనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఫ్‌డీఓ మాట్లాడుతూ వచ్చే నెల 20 నుంచి 26 వరకు జాతీయ పులుల గణన నిర్వహించాలన్నారు. 20 నుంచి 23 వరకు మాంసాహార శాఖ జంతువులైన పులులు, ఎలుగుబండ్లు, చిరుతలు, నక్కలు, తోడేళ్లు వంటి జంతువుల గణన, 24 నుంచి 26 వరకు శాకాహార జంతువులు దుప్పులు, సాంబార్లు, అడవిదున్నలు తదితర జంతువుల గణన నిర్వహించాలని సూచించారు. ఎఫ్‌డీఓలు బాబు, కట్టా దామోదర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
సబ్ జైలు తనిఖీ
ఇల్లెందు: ఇల్లెందు సబ్ జైలును న్యాయమూర్తి దేవరపల్లి కీర్తి చంద్రికారెడ్డి గురువారం సందర్శించారు. ఖైదీలకు అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం ఆహారం అందించాలని సూచించారు. దీర్ఘకాలంగా సబ్ జైలులో ఉంటున్న పేద ఖైదీలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు, జైలర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
 
							పులుల గణన పక్కాగా నిర్వహించాలి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
