బీమా సొమ్ము స్వాహా
భద్రాచలంఅర్బన్: బీమా సొమ్ము కాజేసిన నలు గురు నిందితులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బూర్గంపాడు మండలం సారపాక భాస్కర్‌నగర్‌కు చెందిన భూక్యా శ్రీ రాములు మృతి చెందినట్లు నకిలీ మరణ ధ్రువపత్రం ద్వారా భద్రాచలం ఎల్‌ఐసీ శాఖ నుంచి రూ.10లక్షల పరిహారం పొంది వాటాలు పంచుకున్నారు. వాటాదారుల మధ్య విభేదాలు రావడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ విషయం బయట పడింది. నిందితులు భూక్యా రాధ, ఆమె భర్త భూక్యా శ్రీ రాములు, భూక్యా లక్ష్మా, షేక్ యాకుబ్ పాషాలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తెలిపారు. మిగిలిన ముద్దాయిల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. భద్రాచలం ఎల్‌ఐసీ శాఖ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నలుగురు నిందితులు అరెస్ట్


