నిమ్మవాగులో కొట్టుకుపోయిన డీసీఎం
కొణిజర్ల/అశ్వారావుపేటరూరల్: కొణిజర్ల మండ లం అంజనాపురం సమీపాన నిమ్మ వాగులో బుధవారం ఓడీసీఎం కొట్టుకుపోగా డ్రైవర్ గల్లంతయ్యా డు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధి మారుతినగర్‌కు చెందిన ఆరేపల్లి మురళి (32) మూడు రోజుల క్రితం అదే మండలం నారావారిగూడెం వాసి మునుగొండ వెంకటముత్యం డీసీఎం వ్యాన్‌కు డ్రైవర్‌గా వచ్చాడు. సుజాతనగర్‌లో పత్తి లోడ్ తీసు కుని వరంగల్ జిల్లాలో దిగుమతి చేసి బుధ వారం వస్తుండగా అంజనాపురం వద్ద నిమ్మవాగు వరద బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తోంది. కొణిజర్ల వైపు నుంచి డీసీఎంలో వస్తున్న మురళి వరద దాటేందుకు యత్నిస్తుండగా మరో వైపు ఉన్న స్థానికులు, ఏన్కూరు పోలీసులు వారించారు. అయినా వినకుండా ముందుకు సాగడంతో వరద ఉధృతికి వ్యాన్ కొట్టుకుపోయింది. డ్రైవర్ గల్లంతయ్యాడనే సమాచారం తెలియంతో ఎస్‌ఐ జి.సూరజ్ ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని రప్పించి గాలించగా సాయంత్రం వరకు కూడా ఆచూకీ తెలియరాలేదు. కాగా, మురళికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన గల్లంతయ్యాడనే సమాచారం తెలియడంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది.
వరదలో గల్లంతైన డ్రైవర్
నిమ్మవాగులో కొట్టుకుపోయిన డీసీఎం


