కిచెన్‌గార్డెన్లతో ఆరోగ్యం
● కూరగాయలు, ఆకు కూరల మొక్కల పెంపకం ● పిల్లలు, గర్భిణులకు రసాయన రహిత ఆహారం.. ● జిల్లాలోని 295 అంగన్‌వాడీ కేంద్రాల్లో పెంపకం
పోషన్ వాటిక కార్యక్రమంలో భాగంగా 55 అంగన్‌వాడీ కేంద్రాల్లో గతేడాది కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేశాం. మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో ఈ ఏడాది 295 కేంద్రాల్లో ఆకు కూరలు, కూరగాయలు సాగు చేపట్టాం. విడుతల వారీగా అన్ని కేంద్రాల్లో అమలు చేస్తాం.
–స్వర్ణలత లెనినా, జిల్లా సంక్షేమ అధికారి
గుండాల: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆట పాటలతో కూ డిన గుణాత్మక విద్యతోపాటు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో పోషన్ వాటిక కార్యక్రమంలో భా గంగా కిచెన్ గార్డెన్‌లకు శ్రీకారం చుట్టారు. గతేడాది 55 అంగన్‌వాడీ కేంద్రాల్లో వీటిని పెంచారు. ఆయా కేంద్రాల్లోనే కూరగాయలు, ఆకు కూరలు సాగు చేసి పిల్లలు, బాలింతలు, గర్భిణులకు వంట చేయాల్సి ఉంది. రసాయనిక ఎరువుల అవసరం లేకుండా పండించే కూరగాయలతో ఆరోగ్యం మెరుగుపడుతుందని అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
295 కేంద్రాల్లో సాగు..
జిల్లాలో పోషన్ వాటిక కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది 295 అంగన్‌వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్‌లు పెంచుతున్నారు. గతేడాది సత్ఫలితాలు రావడంతో ఈసారి కేంద్రాల సంఖ్య పెంచారు. ఈ ఏడాది మండలానికి నాలుగు నుంచి ఐదు కేంద్రాలను ఎంపిక చేసి కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేశారు. తోటకూర, గోంగూర, పుదీన, కొత్తిమీర, మెంతుకూర వంటి ఆకు కూరలతోపాటు బెండకాయ, వంకాయ, గోరుచిక్కుడు తదితర కూరగాయలు పండిస్తున్నారు.
ఒక్కో కిచెన్ గార్డెన్‌కు రూ.10 వేలు
కిచెన్ గార్డెన్ పెంపకానికి ఒక్కో కేంద్రానికి రూ.10 వేల చొప్పున విడుదల చేశారు. ఆరు రింగులు ఏర్పాటు చేసుకుని, ఖాళీ స్థలంలో మట్టి నింపుకోవాలి. ఆరు సిమెంట్ పోల్స్ వేసి గ్రీన్ మ్యాట్ కట్టాలి. మొక్కలు ఏపుగా పెరిగి, కాపు వచ్చే వరకు కిచెన్ గార్డెన్లను కాపాడుకోవాల్సి బాధ్యత టీచర్, ఆయాలపైనే ఉంది. ప్రస్తుతం పెంచుతున్న కేంద్రాల్లో సత్ఫలితాలు వస్తే అన్ని కేంద్రాల్లో కిచెన్ గార్డెన్ల పెంపకానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపా రు. వీటిలో పండించిన ఆకుకూరలు, కూరగాయలతోనే పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌషికాహారం అందించాలని చెబుతున్నారు. దీంతో కూరగాయలు, ఆకు కూరలు కిరాణ దుకాణాల్లో కొనుగోలు చేసుకునే అవసరం ఉండదు. రసాయనిక ఎరువుల ప్రభావం లేకపోవడంతో ఆరోగ్యానికి మేలు చేస్తాయని జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా తెలిపారు.
కిచెన్‌గార్డెన్లతో ఆరోగ్యం


