పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శిగా సురేష్‌బాబు
భద్రాచలంటౌన్: ీపఆర్‌టీయు రాష్ట్ర కార్యదర్శిగా భద్రాచలం పట్టణా నికి చెందిన తోటమళ్ల సురేష్ బాబు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బిక్షంగౌడ్ బుధవారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి, ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
‘జీఎన్‌ఎం’ గడువు పొడిగింపు
చుంచుపల్లి: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నుంచి విడుదలైన జీఎన్‌ఎం కోర్సుల్లో చేరికలకు గడువు తేదీని నవంబర్ వరకుపొడిగించినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్. జయలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఈ అవకాశాన్ని అర్హత కలిగిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఖమ్మం మార్కెట్‌కు
సెలవుల పొడిగింపు
ఖమంవ్యవసాయం: ‘మోంథా’ తుపాను కారణంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవులను పొడిగించారు. తొలుత బుధవారం వరకు సెలవు ప్రకటించగా.. తుపాన్ తీవ్రత నేపథ్యాన శుక్రవారం(31వ తేదీ) వరకు సెలవులు కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆపై నవంబర్ 1న శనివారం, 2న ఆదివారం వారాంతపు సెలవులు కావడంతో నవంబర్ 3వ తేదీ సోమవారం నుంచి పంట కొనుగోళ్లు మొదలవుతాయని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని రైతులు, వ్యాపారులు, కార్మికులు గమనించాలని సూచించారు.
2న అండర్–19
నెట్‌బాల్ ఎంపికలు
ఖమ్మంస్పోర్ట్స్: ఉమ్మడి జిల్లాస్థాయి అండర్–19 బాలబాలికల నెట్‌బాల్ జట్లను వచ్చేనెల 2న ఎంపిక చేయనున్నారు. ఈ ఎంపిక పోటీలు ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్‌లో జరుగుతాయని జూనియర్ కళాశాల క్రీడా సంఘం కార్యదర్శి ఎండీ మూసాకలీం తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయస్సు ధ్రువపత్రాలతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని, వివరాలకు 98483 41238 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
ఇద్దరిని కాపాడిన
ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం
కొణిజర్ల: పోలీసులు, స్థానికులు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా ద్విచక్ర వాహనంపై వరద దాటేందుకు యత్నిస్తున్న ఇద్దరు యువకులు పడిపోగా.. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సభ్యులు కాపాడారు. కొణిజర్ల మండలం తీగలబంజర సమీపాన పగిడేరు ఉధృతంగా ప్రవహిస్తుండగా బుధవారం మధ్యా హ్నం పోలీసులు ట్రాక్టర్ అడ్డు పెట్టి రాకపోకలు నిలిపేశారు. ఇంతలోనే ఇద్దరు యువకులు పోలీసులను ఖాతరు చేయకుండా వాగు దాటే క్రమాన వరద ఉధృతికి వాహనం జారి పడబోయింది. అక్కడే ఉన్న ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సకాలంలో స్పందించి తాళ్ల సాయంతో ద్విచక్రవాహనం సహా యువకులను బయటకు లాగడంతో ఊపిరి పీల్చుకున్నారు.
పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శిగా సురేష్‌బాబు


