
26న ‘సింగరేణి’ జాబ్‌మేళా
సత్తుపల్లి: సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 26న జాబ్‌మేళా నిర్వహించనున్నారు. సంస్థ ఆధ్వర్యాన నిర్వహించే జాబ్‌మేళా పోస్టర్లను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సింగరేణి గనులతో కిష్టారం వాసులు నష్టపోయినందున గ్రామంలో పర్యావరణ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసు కోవాలని సూచించారు. అలాగే, సైలో బంకర్ నుంచి వాయు కాలుష్యం వెలువడకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని తెలిపారు. మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, చల్లగుళ్ల నర్సింహారావు, ఉడతనేని అప్పారావు, చల సాని సాంబశివరావు, సింగరేణి పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు పాల్గొన్నారు.