కరకగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో పొగమంచు కమ్మేస్తోంది. పచ్చని పొలాలపై కమ్ముకుని ప్రకృతి రమణీయతను చాటుతోంది. సమీపంలోకి వచ్చేవరకు రహదారులపై వాహనాలు కనిపించడంలేదు. శనివారం కరకగూడెం ప్రధాన రహదారిపై, పొలాల్లో పొగమంచు దట్టంగా అలుముకుంది.
పాఠశాలకు శాశ్వత భవనం నిర్మిస్తాం
అసిస్టెంట్ కలెక్టర్ సౌరభ్ శర్మ
పాల్వంచరూరల్: పూరిపాకలో నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలకు శాశ్వత భవనం నిర్మించేలా చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ కలెక్టర్ సౌరభ్ శర్మ అన్నారు. మండల పరిధిలోని బండ్రుగొండ గ్రామపంచాయతీ ఆదివాసీల నివాసప్రాంతమైన కొయ్యగట్టు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను శనివారం ఆయన సందర్శించారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాలకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీరాంమూర్తి, విద్యాశాఖ జిల్లా కోఆర్డినేటర్లు ఎన్.సతీష్‌కుమార్, ఎస్‌కె సైదులు పాల్గొన్నారు.
రోటరీ సీఎస్సార్
అవార్డు ప్రదానం
పాల్వంచ: రోటరీ ఇండియా నేషనల్ సీఎస్‌ఆర్ అవార్డ్–2025 అవార్డ్‌ను పాల్వంచలోని నవ లిమిటెడ్ సంస్థ అందుకుంది. ఈ నెల 17న బెంగళూరు చాంచారి పెవిలియన్ వేదికగా జరిగిన రోటరీ ఇండియా నేషనల్ సీఎసార్ అవార్డ్స్ రీజియన్ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ఉమారెడ్డి చేతుల మీదుగా నవ లిమిటెడ్ ప్రెసిడెంట్ ఎల్‌వి.శరత్ బాబు, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ విఎస్.రాజు, జనరల్ మేనేజర్(సీఎస్‌ఆర్) ఎంజీఎం ప్రసాద్‌లు అవార్డును అందుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య, జీవనోపాధులు, ఇతర కార్యక్రమాల ద్వారా సామాజిక అభివృద్ధికి నవ లిమిటెడ్ చేస్తున్న కృషిని గుర్తించి అవార్డు అందించారని తెలిపారు.
గర్భిణి కడుపులో
శిశువు మృతి
భద్రాచలంఅర్బన్: గర్భిణి కడుపులో ఉన్న శిశువు మృతి చెందగా.. అందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె బంధువులు భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పతి ఎదుట శనివారం ఆందోళనకు దిగారు. భద్రాచలంకు చెందిన ప్రవీణ్ కుమార్ – ఉషశ్రీకి మూడేళ్ల క్రితం వివాహం జరగగా ఆమె కొద్దినెలల క్రితం గర్భం దాల్చింది. గత మూడు నెలలుగా స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు చేయిస్తుంటే శిశువు ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. ఈ నెల ప్రవసం జరుగుతుందని చెప్పగా, శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఉషశ్రీకి కడుపులో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెకు నర్సులు పరీక్షలు నిర్వహించాక రాత్రి 7గంటలకు వైద్యురాలు వచ్చి పరిస్థితి విషమించిందంటూ ఆపరేషన్ చేసి మృతి శిశువును బయటకు తీశారు. ఇంకా సమయం గడిస్తే తల్లి పరిస్థితి కూడా విషమించేదని, వైద్యురాలు, నర్సుల నిర్లక్ష్యంతో ఇలా జరిగిందని ఉషశ్రీ భర్త ప్రవీణ్‌కుమార్ ఆరోపించాడు. ఈమేరకు ఆస్పత్రి ఎదుట ఆమె బంధువులు ఆందోళనకు దిగారు.
ముష్టికుంట్ల వాసికి డాక్టరేట్
బోనకల్: మండలంలో ని ముష్టికుంట్లకు చెంది న కేవీ నారాయణకు డాక్టరేట్ లభించింది. ‘ది రైటింగ్స్ ఆఫ్ ఆర్‌కే నారాయణ్, ఎన్‌రిచ్‌మెంట్ ఆఫ్ ఇండియన్ ఇంగ్లిష్’ అంశంపై ఆయన సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథాని కి ఉత్తరప్రదేశ్‌లోని జేఎస్ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. కాగా, నారాయణ ప్రస్తుతం ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంగ్లిష్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
కమ్మేసిన పొగమంచు
కమ్మేసిన పొగమంచు
కమ్మేసిన పొగమంచు
కమ్మేసిన పొగమంచు