
ఏరియా ఆస్పత్రి నుంచి రిఫర్..
మార్గమధ్యలో 108 వాహనంలో ప్రసవం
ఇల్లెందురూరల్: మండలంలోని ముత్తారపుకట్ట గ్రామానికి చెందిన ఇర్ప దేవి పురిటి నొప్పులతో శనివారం ఇల్లెందు ప్రభుత్వాసుపత్రిలో చేరింది. అక్కడి వైద్యులు ఆమెను ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. 108లో తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు అధికమై ప్రసవించింది. ఈఎంటీ రేణుకాదేవి సేవలందించారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని 108 సిబ్బంది తెలిపారు. ఉమ్మనీరు తక్కువగా ఉందని, తల్లి కడుపులో బిడ్డ కదలికలు సరిగా తెలియడం లేదని ఇల్లెందు ఆస్పత్రి సిబ్బంది చెప్పారని, ఆ వెంటనే సీ సెక్షన్ కోసం ఎనస్తీషియా ఇవ్వగా మత్తు ఎక్కలేదని పేర్కొంటూ ఖమ్మం రిఫర్ చేశారని ఇర్ప దేవి చెప్పినట్లు 108 సిబ్బంది వివరించారు. గర్భిణికి 108 సిబ్బంది వాహనంలోనే సాధారణ కాన్పు చేశారు. అయితే గర్భిణిని ఖమ్మం రిఫర్ చేసేందుకు వైద్యులు చూపిన కారణాలు ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై ప్రశ్నలు ఉత్పన్నం చేసేలా ఉన్నాయి. ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు.