
యంత్ర సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించాలి
మణుగూరు టౌన్: బొగ్గు, ఓబీ వెలికితీతలో యంత్రాల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సింగరేణి డైరెక్టర్(ఈఅండ్‌ఎం) తిరుమలరావు అన్నారు. శనివారం మణుగూరులో పర్యటించిన ఆయన ఏరియా జీఎం దుర్గం రాంచందర్‌తో కలిసి పీకేఓసీ–2, 4 గనులను వ్యూ పాయింట్ నుంచి బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీతలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీహెచ్‌పీ వరకు బెల్ట్ కన్వేయర్ సిస్టం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జీఎం కార్యాలయంలో అధికారులతో సమావేశమై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీనివాస్, శ్రీనివాసచారి, వెంకట రామారావు, వీరభద్రరావు, శ్రీనివాస్, రమేశ్, వీరభద్రుడు, మధన్‌నాయక్, బైరెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
సింగరేణి డైరెక్టర్ తిరుమలరావు