
అక్రమంగా మట్టి తవ్వకాలు
టేకులపల్లి: మండలంలోని తొమ్మిదోమైలుతండా శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు వెనకాల పార్కు సమీపంలో ఉన్న గుట్ట మట్టి తవ్వకాలతో కరిగిపోతోంది. ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా మట్టి తవ్వి తరలిస్తున్నారు. నాలుగు నెలల నుంచి యథేచ్ఛగా పగలు రాత్రి తేడా లేకుండా మట్టి తవ్వకాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. మట్టితోలుతున్న ట్రాక్టర్లను మైనర్ బాలురు నడుపుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. మితిమీరిన వేగంతో ట్రాక్టర్లు నడుపుతుండగా, అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఆదాయానికి గండికొడుతూ, గుట్ట మట్టిని స్వాహా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.