
అటవీ క్రీడా పోటీలకు 37 మంది ఎంపిక
పాల్వంచరూరల్ : ఇటీవల కొత్తగూడెంలో జరిగిన జిల్లా స్థాయి అటవీ క్రీడా పోటీల్లో ప్రతిభ చూపిన 37 మంది క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. హైదరాబాద్‌లోని ఫారెస్ట్ అకాడమీలో ఈనెల 17, 18 తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్‌లో వీరు పాల్గొంటారని వైల్డ్‌లైఫ్ ఎఫ్‌డీఓ బి.బాబు, పాల్వంచ ఎఫ్‌డీఓ దామోదర్‌రెడ్డి తెలిపారు.
జాతీయ అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం
సూపర్‌బజార్(కొత్తగూడెం): అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒడిశాలోని భువనేశ్వర్ కళింగ స్టేడియంలో సోమవారం రాత్రి ముగిసిన 40వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కరకగూడేనికి చెందిన తోలెం శ్రీతేజ స్వర్ణ పతకం సాధించిందని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.మహీధర్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీతేజను కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం అభినందించారు. భవిష్యత్‌లో అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ఆకాంక్షించారు. శ్రీతేజ మాట్లాడుతూ కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రోత్సాహంతో స్వర్ణ పతకం సాధించానంటూ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా క్రీడల అధికారి ఎం. పరంధామరెడ్డి, కోచ్ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు బూర్గంపాడు
విద్యార్థిని..
బూర్గంపాడు: బూర్గంపాడుకు చెందిన మేకల సృజన రాష్ట్ర స్థాయి బాలికల ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికై ంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న సృజన ఇటీవల నిర్వహించిన జిల్లాస్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది.