
ముగిసిన టీటీ ర్యాంకింగ్ టోర్నీ
ఖమ్మం స్పోర్ట్స్ : మూడు రోజులుగా నగరంలోని సర్థార్ పటేల్‌స్టేడియంలో జరిగిన బాలసాని సాన్యసయ్య స్మారక రాష్ట్రస్థాయి ర్యాంకింగ్ టోర్నీ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ ఖమ్మంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. క్రీడా సంఘాల బాధ్యుల కృషి వల్లే ఖమ్మంలో విరివిగా రాష్ట్రస్థాయి టోర్నీలు జరుగుతున్నాయన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు బాలసాని విజయ్‌కుమార్, రాష్ట్ర టీటీ అసోసియేషన్ అధ్యక్షులు కె.కె.మహేశ్వరి, కార్యదర్శి సి.నాగేందర్‌రెడ్డి, ఎన్.లక్ష్మీకాంత్, సీనియర్ కోచ్ సోమనాథ్ ఘోష్ తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
అండర్–11 బాలికల విభాగం ఫైనల్స్‌లో అపర్ణ, యశశ్రీ, అండర్–13 విభాగంలో డి.అవంతిక, బి.వి.మహిమకృష్ణ, అండర్ –15 విభాగంలో బి.వి. మహిమకృష్ణ, గాయత్రి కృష్ణ, అండర్–17 విభాగంలో అవంతిక, పి.జలని, అండర్–19 విభాగంలో కె.శ్రేష్ఠ, వైష్ణవి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. బాలుర అండర్–11 విభాగంలో ఎం.విహాన్, నివాస్, అండర్–13 విభాగంలో సాగర్, పి.వేదాన్ష్, అండర్–15 విభాగంలో జె.ఎ. విలోహిత్, ప్రమాణ్, అండర్–17 విభాగంలో ఎం.ధర్మతేజ సాయి, పి.శ్రీహానీష్, అండర్–19 విభాగంలో అరూష్‌రెడ్డి, ఎం.దేవాన్ష్, పురుషుల విభాగంలో స్వర్నెండ్ చౌదరి, బి.వరుణ్ శంకర్, మహిళల విభాగంలో నిఖితా బాను, వరుణి జైస్వాల్ ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు.