
‘మద్యం’ దరఖాస్తులు 102
గడువులోగా వస్తాయి
పాల్వంచరూరల్: నూతన వైన్‌షాపుల లైసెన్స్ మంజూరు ద్వారా ప్రభుత్వం ఆశించిన ఆదాయం వచ్చే పరిస్థితి కన్పించడంలేదు. శనివారం వరకు జిల్లాలో కేవలం 102 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. తద్వారా రూ.3.06 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది షాపు లైసెన్స్ కోసం రూ.2 లక్షలు మాత్రమే ఉండగా, ఈ సారి రూ.3 లక్షలకు పెంచారు. దీంతో వైన్‌షాపుల లైసెన్స్‌కోసం ఆసక్తి చూపడంలేదనే చర్చ సాగుతోంది. గతంలో మద్యం వ్యాపారులు పోటీలు పడి ఒక్కొక్కరు ఐదు, పది షాపులకు దరఖాస్తు చేసుకునేవారు. ఈసారి మాత్రం ఉత్సాహం చూపడంలేదు. గడువులోగా ఆశించిన మేరకు దరఖాస్తులు వస్తాయనే భావనలో ఎకై ్సజ్ అధికారులు ఉన్నారు. ఇప్పటివరకు మణుగూ రు, కొత్తగూడెం ఎక్సైజ్‌స్టేషన్ల పరిధి లో తక్కువ దరఖాస్తులు రాగా, అశ్వారావుపేటలో అధికంగా 63 దరఖాస్తులు వచ్చాయి.
ఎకై ్సజ్ శాఖకు రూ.3.06 కోట్ల ఆదాయం
నూతన వైన్ షాపుల లైసెన్స్ కోసం శనివారం వరకు 102 దరఖాస్తులు వచ్చాయి. శనివారమే 50 దరఖాస్తులు అందాయి. ఈ నెల 18వ తేదీ వరకు గడువు ఉంది. ఆలోగా అనుకున్న మేర దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నాం. –జానయ్య,
జిల్లా ఎకై ్సజ్‌శాఖ సూపరింటెండెంట్