కిన్నెరసాని గేటు ఎత్తివేత | - | Sakshi
Sakshi News home page

కిన్నెరసాని గేటు ఎత్తివేత

Oct 12 2025 6:43 AM | Updated on Oct 12 2025 6:43 AM

కిన్న

కిన్నెరసాని గేటు ఎత్తివేత

పాల్వంచరూరల్‌: ఎగువన కురుస్తున్న వర్షాలకు కిన్నెరసాని జలయాశానికి వరద కొనసాగుతోంది. శనివారం నీటిమట్టం 406.40 అడుగులకు పెరగడంతో ప్రాజెక్టుకు చెందిన ఒక గేటును ఎత్తివేసి 2 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు ఏఈ తెలిపారు.

ఎస్పీకి రేగా ఫిర్యాదు

కొత్తగూడెంటౌన్‌: మణుగూరు పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో సీఐ ఎదుట ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనుచరుడు గంటా రమేశ్‌ ఓ రైతుపై చేయి చేసుకున్న ఘటనలో అతడితోపాటు సీఐపై చర్యలు తీసుకోవాలని శనివారం ఎస్పీ రోహిత్‌రాజుకు బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఫిర్యాదు చేశారు. కొత్తగూడెంలో ఎస్పీ రోహిత్‌రాజును బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కలిసి ఘటన వివరాలు వెల్లడించారు. అనంతరం రేగా మాట్లాడుతూ.. శుక్రవారం కమలాపురం గ్రామంలో ఓ రైతుపై చేయి చేసుకుంటుంటే సీఐ ఏం చేస్తున్నారని, ఇసుక మాఫియాకు ఎందుకు వత్తాసు పలుకుతున్నారని, కారకులను కఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరినట్లు రేగా తెలిపారు. కార్యక్రమంలో కుర్రి నాగేశ్వరావు, కుంట లక్ష్మణ్‌, నూకారపు రమేశ్‌, పోషం నర్సింహారావు, తాళ్లపల్లి యాదవ్‌గౌడ్‌, మధు, బోశెట్టి రవిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

సర్పాలు మనుషులు,

ప్రకృతికి ఉపయోగమే..

కొత్తగూడెంఅర్బన్‌: సర్పాలు మనుషులు, ప్రకృతికి ఉపయోగకరమేనని ప్రాణధార ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, రెస్క్యూ స్పెషలిస్టు సంతోష్‌ తెలిపారు. కొత్తగూడెం కార్పొరేషన్‌ పరిధిలోని రామవరం, రామా టాకీస్‌ ఏరియా, పాత కొత్తగూడెం, బాబూక్యాంప్‌, సెంట్రల్‌ పార్క్‌ ప్రాంతాల్లో ఇటీవల ఇళ్లల్లోకి చేరి సురక్షితంగా బంధించి నాలుగు నాగు పాములు (నాజా నాజా), నూనె కట్లపాము (వోల్ఫ్‌ స్నేక్‌), జెర్రిపోతు (రాట్‌ స్నేక్‌) జాతులకు చెందిన ఆరు పాములను శనివారం అటవీ ప్రాంతంలో విడుదల చేశారు. ప్రకృతి జీవరాసులైన సర్పాలతో క్రిమి కీటకాలు, పంట వినాశకాల నియంత్రణ, జీవవైవిద్యం, ఔషధాల ఉత్పత్తి కోసం సర్పాల అవసరం ఉన్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో రెస్క్యూటీం సభ్యుడు నారదాసు శ్రీకాంత్‌ (చోటు) పాల్గొన్నారు.

కొనసాగుతున్న టీటీ ర్యాంకింగ్‌ టోర్నీ

ఖమ్మంస్పోర్ట్స్‌: ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న బాలసాని సన్యాసయ్య స్మారక రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్‌ ర్యాంకింగ్‌ టోర్నీ శనివారం రెండో రోజుకు చేరింది. అండర్‌–11, 13 బాలికల విభాగంలో జిల్లాకు చెందిన బాలసాని తన్మయి, హార్వికతో పాటు డి.శాన్విక క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరారు. అండర్‌– 13, 17 బాలుర విభాగంలోనూ జిల్లా క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇక హైదరాబాద్‌, రంగారెడ్డి, జిల్లాల క్రీడాకారులు సైతం తమ ర్యాంకును నిలుపుకునేందుకు పోటీ పడుతున్నారు. శనివారం రాత్రి 45 – 80 ఏళ్ల కేటగిరీల పోటీలు ప్రారంభమయ్యాయి. కాగా, ఆదివారం రాత్రి ఫైనల్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తా మని టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు బాలసాని విజయ్‌కుమార్‌ తెలిపారు. అంతేకాకజాతీయస్థాయి టోర్నీలో పాల్గొనే రాష్ట్రజట్లను ఎంపిక చేస్తా మని వెల్లడించారు. పోటీల ముగింపు సమావేశానికి టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.కె.మహేశ్వరి, సి.నాగేందర్‌రెడ్డి, టెక్నికల్‌ అఫీషియల్‌ ఎన్‌.లక్ష్మీకాంత్‌, సీనియర్‌ కోచ్‌ సోమనాథ్‌ఘోష్‌, మేయర్‌ పి.నీరజ హాజరవుతారని తెలిపారు.

కిన్నెరసాని గేటు ఎత్తివేత 1
1/3

కిన్నెరసాని గేటు ఎత్తివేత

కిన్నెరసాని గేటు ఎత్తివేత 2
2/3

కిన్నెరసాని గేటు ఎత్తివేత

కిన్నెరసాని గేటు ఎత్తివేత 3
3/3

కిన్నెరసాని గేటు ఎత్తివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement