
వర్షానికి కూలిన ఇల్లు
దమ్మపేట: మండలంలోని పెద్దగొల్లగూడెం గ్రామంలో యదిరాజు కన్నయ్యకు చెందిన తాటి ఆకుల పూరిల్లు సోమవారం ఒక్కసారిగా కుప్పకూలిపోగా, ఇంటి పైకప్పు నేలను తాకింది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దగొల్లగూడెం గ్రామంలో కన్న య్య, పున్నమ్మ దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో ఓ పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంటి కట్టిన తడికెలు, పైకప్పు కలప బాగా తడిసి పటుత్వం కోల్పోయాయి. సోమవారం ఉదయం వర్షం కురుస్తుండగానే ఒక్కసారిగా పూరిల్లు కూలిపోయింది. ఇంట్లో వంట సామగ్రి, నిత్యావసరాలు ధ్వంసమయ్యా యి. ఆ సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. సర్వస్వం కోల్పోయిన తమను ఆదుకోవాలని కన్నయ్య కుటు ంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.