
రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో ఐదు పతకాలు
కొత్తగూడెంటౌన్: ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు హనుమకొండలో జరిగిన ఎస్‌జీఎఫ్ బాక్సింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా క్రీడాకారులు ఐదు పతకాలు సాధించారని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి తెలిపారు. స్థానిక ఐడీఓసీలో సోమవారం ఆయన క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖోఖో పోటీలో మధిరకు చెందిన బి.జాహ్నవి, ఇల్లెందుకు చెందిన పి.భువనశ్రీ, నేలకొండపల్లికి చెందిన బి.రూప బంగారు పతకాలు, ఎర్రుపాలెంకు చెందిన కె.సానియా రజిత పతకం, అన్నపురెడ్డిపల్లికి చెందిన టీ.హాసిని కాంస్య పతకం సాధించారని వివరించారు. క్రీడాకారులు మరింతగా రాణించి జిల్లా ఖ్యాతిని జాతీయస్థాయిలో ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.