
విజయానికి చిహ్నంగా..
న్యూస్‌రీల్
ఇల్లెందు.. మరో మైసూర్..
రామదాసు మండపంలో శమీ, ఆయుధ పూజలు శ్రీరామలీలా మహోత్సవ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు నిజరూపంలో దర్శనమిచ్చిన శ్రీ మహాలక్ష్మి
గురువారం శ్రీ 2 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. రామదాసు కాలం నుంచి ఇలా ఆలయం తరఫున దసరా వేడుకలు జరపడం ఆనవాయితీ కాగా, ఈ వేడుకలకు దసరా మండపం వేదిక కానుంది. ఈ సందర్భంగా గురువారం శ్రీ సీతాలక్ష్మణ సమేత రామచంద్రస్వామిని పల్లకీ సేవగా దసరా మండపంలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం జమ్మి చెట్టు వద్ద శమీ, ఆయుధ పూజలు చేస్తారు. రావణాసుర వధగా జరిపే శ్రీ రామలీలా మహోత్సవానికి ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వేడుక నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు.
నిజరూపంలో దర్శనమిచ్చిన శ్రీ మహాలక్ష్మి..
తొమ్మిది రోజులుగా జరుగుతున్న శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం ముగిశాయి. చివరి రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారు నిజ రూపంలో దర్శనమిచ్చారు. మానవులకు అవసరమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించేందుకు అష్టలక్ష్మీ రూపాలను ధరించిన ఆదిలక్ష్మి, కరుణాస్వరూపమైన తన నిజరూపంలో దర్శనమిచ్చి అనుగ్రహిస్తుందంటూ అలంకరణ విశిష్టతను అర్చకులు వివరించారు. ఈ సందర్భంగా సామూహిక కుంకుమార్చన, చిత్రకూట మండపంలో రామాయణ పారాయణం జరిగాయి. ఉదయం బేడా మండపంలో స్వామి వారి నిత్యకల్యాణాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఇల్లెందు: దసరా వేడుకలకు ఇల్లెందులోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్ ముస్తాబైంది. ఇక్కడ మైసూర్‌ను తలపించే రీతిలో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇక ఈ ఏడాది పాలపిట్ట ప్రత్యేకం కానుంది. ఇప్పటి వరకు పాల పిట్ట బొమ్మను మాత్రమే ఉంచేవారు. కానీ ఈ దఫా నిజమైన పాలపిట్ట ప్రత్యక్షంగా కనిపించనుందని ఉత్సవ కమిటీ ప్రకటించింది. నవరాత్రుల చివరి రోజున విజయ దశమి నాడు శమీ(జమ్మి) పూజ చేయటం సంప్రదాయం. శమీ వృక్షంలో అపరాజితా దేవి కొలువై ఉందని ఆ దేవి మహిమతోనే పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని చెబుతారు. ఇక ఈ ఏడాది ఉత్సవాల్లో జోష్ నింపేలా సినీ, టీవీ నటులతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని దసరా ఉత్సవ మండలి బాధ్యులు తెలిపారు.
దసరా వేడుకలకు సర్వం సిద్ధం

విజయానికి చిహ్నంగా..

విజయానికి చిహ్నంగా..

విజయానికి చిహ్నంగా..

విజయానికి చిహ్నంగా..