
ఘనంగా బీఎస్‌ఎన్‌ఎల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
కొత్తగూడెంఅర్బన్ : కొత్తగూడెం బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో బుధవారం సిల్వర్ జూబ్లీ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉద్యోగులు కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1985లో టెలీ కమ్యూనికేషన్ కింద టెలికాం సర్వీసెస్, టెలికాం ఆపరేషన్‌లుగా రెండు విభాగాలు ఉండేవని, 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం టెలికాం సేవలను కార్పొరేట్ రూపంలోకి మార్చాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో శివరాంజీ, సక్రు, షకీల్, సందీప్, లాలూ నాయక్, బాలకృష్ణ, రామరాజు, సాయికిరణ్, సైదులు, మాన్సింగ్, జైపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, నూర్ మహమ్మద్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.