అటవీశాఖ అనుమతిస్తే.. | - | Sakshi
Sakshi News home page

అటవీశాఖ అనుమతిస్తే..

Sep 24 2025 5:39 AM | Updated on Sep 24 2025 5:41 AM

● గుండాల నుంచి రంగాపురానికి సులువైన ప్రయాణం ● ఐదేళ్ల క్రితం రోడ్డు పనులకు మంజూరైన నిధులు.. ● అనుమతులు రాక నిలిచిపోయిన పనులు ● ఏళ్లుగా ఎదరుచూస్తున్న పలుగ్రామాల ప్రజలు

అనుమతి వస్తే పనులు చేపడుతాం

పనిమీద వెళ్లాలంటే అవస్థలు

రోడ్డు నిర్మిస్తే మేలు

● గుండాల నుంచి రంగాపురానికి సులువైన ప్రయాణం ● ఐదేళ్ల క్రితం రోడ్డు పనులకు మంజూరైన నిధులు.. ● అనుమతులు రాక నిలిచిపోయిన పనులు ● ఏళ్లుగా ఎదరుచూస్తున్న పలుగ్రామాల ప్రజలు

గుండాల: జిల్లాలోని గుండాల –రంగాపురం మధ్య రోడ్డు పరిస్థితి దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని విధంగా ఉంది. నిధులు మంజూరై ఏళ్లు గడుస్తున్నా అటవీశాఖ అనుమతి లేక పనులు జరగడం లేదు. కొంతమేర మాత్రమే రోడ్డు వేసి గ్రామాల మధ్య పనులను నిలిపివేశారు. దీంతో వర్షాకాలంలో ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ రోడ్డు పూర్తయితే అటు మణుగూరుతో పాటు మేడారం జాతర సమయంలో ఎంతో ఉపయోగపడనుంది. భారీ వర్షాల కారణంగా రోడ్డు కోతకు గురవుతుందని, గుంతలు ఏర్పడుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ.24 కోట్లు మంజూరు

గుండాల – రంగాపురం మధ్య 28 కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మించేందుకు ఐదేళ్ల క్రితం నక్సల్స్‌ ప్రభావిత ప్రాంత అభివృద్ధి కింద రూ.24 కోట్లు మంజూరు చేశారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ గుండాల నుంచి సాయనపల్లి వరకు బీటీ రోడ్డు వేయగా అటవీశాఖ అనుమతులు రాకపోవడంతో పనులు నిలిపివేశారు. మధ్యలో ఉన్న వాగులపై బ్రిడ్జి పనులు సైతం పూర్తి చేశారు. అటవీశాఖ అనుమతుల కోసం పాలకులు, అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మణుగూరు నుంచి గుండాలకు బస్సు సౌకర్యం ఉన్నా వర్షాకాలంలో ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో సాయనపల్లి, దామరతోగు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

మేడారం జాతరకు కీలకం

మేడారంలో జరిగే సమ్మక్క – సారలమ్మ జాతరకు గుండాల మీదుగా రాకపోకలు సాగుతున్నాయి. ఇల్లెదు, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి గుండాల మీదుగా వాహనాలు వెళ్తుంటాయి. ఖమ్మం, ఇల్లెందు నుంచి ఆర్టీసీ బస్సులు సైతం నడిపిస్తున్నారు. ప్రస్తుతం గుండాల – పస్రా మీదుగా ప్రయాణం సాగిస్తున్నారు. అయితే, గుండాల – రంగాపురం మధ్య రోడ్డు పనులు పూర్తయితే తాడ్వాయి మీదుగా మేడారం చేరేందుకు రద్దీలేని ప్రయాణం అవుతుంది. మేడారం జాతర సమయంలో వాహనాల రద్దీ విపరీతంగా ఉంటుంది.

వర్షాకాలంలో తప్పని తిప్పలు

సాయనపల్లి – రంగాపురం మధ్య రోడ్డంతా అధ్వానంగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటా రూ.లక్షలు వెచ్చి ంచి మరమ్మతులు చేపడుతున్నా ఫలితం ఉండడం లేదు. భారీ వర్షాలకు రోడ్డంతా కోతకు గురై ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. డబుల్‌ రోడ్డు కాకపోయినా సింగిల్‌ రోడ్డు నిర్మాణమైనా చేపట్టాలని వేడుకుంటున్నారు. సాయనపల్లి, మల్లెలగుంపు, వెంకటాపురం, దామరతోగు, తక్కెళ్లగూడెం, గణాపురం గ్రామాల గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. పనుల నిమిత్తం నియోజకవర్గ ఎమ్మెల్యే వద్దకు వెళ్లాలన్నా ఈ రోడ్డే ఆధారం. పలుమార్లు వినతిపత్రాలు అందించినా ఉపయోగం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

గుండాల – రంగాపురం మధ్య రహదారి నిర్మాణానికి నిధులు మంజూరై ఏళ్లు గడుస్తోంది. అటవీశాఖ నుంచి అనుమాలు రావాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్లు అనుమతుల కోసం విన్నవించాం. అనుమతులు రాగానే రోడ్డు పనులు ప్రారంభిస్తాం. నిధులు ఉన్నా ఫలితం లేకుండా పోతోంది.

–మోతీలాల్‌, ఏఈ ఆర్‌అండ్‌బీ

పనుల నిమిత్తం మణుగూరు వెళ్తుంటాం. వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బస్సు సర్వీసులు నిలిచిపోతే ప్రైవేట్‌ వాహనాలు తిరగవు. వైద్యం పొందాలన్నా మణుగూరు లేదా గుండాల రావాల్సిందే. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తిచేసి, అందుబాటులోకి తీసురావాలి. –వాగబోయిన కృష్ణ, రంగాపురం

ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నా ఫారెస్టు అనుమతులు రావడం లేదు.నిధులు వచ్చినా ఉపయో గం లేదు. ఈ రోడ్డు పనులు పూర్తయితే మేడారం వెళ్లేందుకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. వర్షాలకు రోడ్డు గుంతలమయంగా మారింది. –తోలెం సాంబయ్య, రంగాపురం

అటవీశాఖ అనుమతిస్తే.. 1
1/2

అటవీశాఖ అనుమతిస్తే..

అటవీశాఖ అనుమతిస్తే.. 2
2/2

అటవీశాఖ అనుమతిస్తే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement