
గాయపడిన వ్యక్తి మృతి
చండ్రుగొండ: మండలంలోని గానుగపాడు గ్రామానికి చెందిన వ్యక్తి మొగలిపువ్వు నాగరాజు (44) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన నాగరాజుతో పాటు అతడి స్నేహితుడు ఎల్లయ్య సోమవారం సాయంత్రం ద్విచక్రవాహనంపై సుజాతనగర్ నుంచి గానుగపాడుకు వస్తున్నారు. మార్గమధ్యలో అన్నరంతండా వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వారిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన నాగరాజు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.