
రాష్ట్ర మహిళా క్రికెట్ జట్టుకు తాటిగూడెం బాలిక
కరకగూడెం: అండర్ –15 రాష్ట్ర స్థాయి మహిళా క్రికెట్ జట్టుకు మండలంలోని తాటిగూడెం గ్రామానికి చెందిన రామటెంకి దేవీప్రియ ఎంపికై ంది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక.. క్రికెట్‌లో ప్రతిభ కనబరిచి అండర్ –15 మహిళా క్రికెట్ ప్రాబబుల్ జట్టులో సభ్యురాలిగా ఎంపికై ంది. ఆమె తండ్రి హనుమంతరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. దేవీప్రియకు క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని గమనించిన హనుమంతరావు శిక్షణ ఇప్పించారు. కాగా, ఈనెల 20న హైదరాబాద్‌లో నిర్వహించిన ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్‌లో 600 మంది క్రీడాకారిణుల మధ్య ప్రతిభ చాటిన దేవీప్రియ రాష్ట్ర ప్రాబబుల్ జట్టులో చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా హెడ్ కోచ్ సురేందర్ రెడ్డి, కోచ్‌లు వెంకట్ యాదవ్, బుచ్చిబాబు, రంజీ కోచ్ ఇర్ఫాన్ తదితరులు బాలికను అభినందించారు.
అండర్ – 15 ప్రాబబుల్ టీమ్‌కు ఎంపిక