
ఆర్గానిక్ మల్చింగ్‌పై అవగాహన
అశ్వారావుపేట: వ్యవసాయ వ్యర్థాలతో ఆర్గానిక్ మల్చింగ్ విధానంపై అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్‌కుమార్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. మంగళవారం కళాశాలలోని గ్రీన్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల ఆవరణలోని ఆయిల్‌పాం తోటలో వ్యర్థాలు, తెగిన మట్టలను ఫ్రెడర్, మల్చింగ్ యంత్రాల్లో పొడిగా మలిచి నేల కనిపించకుండా పరిచారు. ప్లాస్టిక్ మల్చింగ్‌కు ప్రత్యామ్నాయంగా ఆర్గానిక్ మల్చింగ్ చేయడంతో కలిగే ప్రయోజనాలు, సంపద ఎలా సృష్టించాలో విద్యార్థులకు హేమంత్‌కుమార్ వివరించారు. గ్రీన్ క్లబ్ నిర్వాహకులు డాక్టర్ నీలిమ తెలంగాణలో ఆయిల్‌పాం విస్తీర్ణం, సాగు, మట్టలతో మల్చింగ్‌తోపాటు నేలకు పోషకాలు అందుతాయని తెలిపారు. వ్యర్థాలను ఉపయోగించి విలువైన పదార్థాల తయారీకి ముందుకు వచ్చే స్టార్టప్ కంపెనీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహకాలను వివరించారు. కార్యక్రమంలో కళాశాల బోధనా సిబ్బంది రాంప్రసాద్, రవికుమార్, శ్రీనివాస్, దీపికరెడ్డి తదితరులు పాల్గొన్నారు.