ఆదివాసీల అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీల అభివృద్ధికి కృషి

Sep 19 2025 2:17 AM | Updated on Sep 19 2025 2:17 AM

ఆదివాసీల అభివృద్ధికి కృషి

ఆదివాసీల అభివృద్ధికి కృషి

భద్రాచలంటౌన్‌: ఆదివాసీ గిరిజనుల సంక్షేమం, విద్యాభివృద్ధికి ఐటీడీఏ ద్వారా కృషి చేస్తున్నామని పీఓ బి.రాహుల్‌ దిసోం సంస్థ బృందానికి తెలిపారు. జార్ఖండ్‌ రాష్ట్రంలోని దిసోం సంస్థ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 25 మంది విద్యార్థులు ఐటీడీఏ అమలుచేస్తున్న వివిధ పథకాల పరిశీలన నిమిత్తం గురువారం వచ్చారు. ఈ సందర్భంగా పీఓ రాహుల్‌ను కలిసి వారు పరిశీలన చేసిన ప్రదేశాల గురించి క్లుప్తంగా వివరించారు. అనంతరం పీఓ మాట్లాడుతూ.. ఆదివాసీ గిరిజన మహిళలకు సబ్బులు, మిల్లెట్‌ బిస్కెట్లు, నాప్కిన్‌ వంటి వస్తు తయారీ యూనిట్లను, న్యూట్రి బాస్కెట్‌, చిక్కి యూనిట్‌, దాల్‌ మిల్‌, బ్రిక్స్‌ తయారీ, న్యూట్రి డ్రైమిక్స్‌, ఇప్పపువ్వు లడ్డూ యూనిట్ల ద్వారా జీవనోపాధి కలిస్తున్నట్లు తెలిపారు. ఉన్నత విద్యనభ్యసించే వారికి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల కోసం ఉద్దీపకం వర్క్‌బుక్స్‌తో పాటు కెరీర్‌ గైడెన్స్‌ ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గిరిజన సంస్కృతిని తెలిపేలా మ్యూజియం ఏర్పాటు చేశామని, వారి గోత్రాలు సేకరించి ఇలవేల్పుల గ్రంధాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. దిసోం సంస్థ వ్యవస్థాపకుడు బిరేన్‌ భాటు మాట్లాడుతూ.. తమ సంస్థ విద్యార్థులు 15 నెలల పాటు దేశ పర్యటన చేసి వివిధ ప్రాంతాల్లోని సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో గిరిజ మావిలన్‌(కేరళ), మిజింగ్‌ నర్జరి(అసోం), మునిర్‌(మహారాష్ట్ర), సోడె శ్రీను, సోడే లెనిన్‌, రాజేంద్రప్రసాద్‌(ఏపీ) పాల్గొన్నారు.

బూడిద తరలింపుతో జీవనోపాధి కల్పించాలి

భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ద్వారా విడుదలయ్యే బూడిదను తరలించే బాధ్యత నిరుద్యోగ గిరిజన యువతకు అప్పగించాలని, వారికి జీవనోపాధి కల్పించాలని రాహుల్‌ అన్నారు. తన చాంబర్‌లో గురువారం బీటీపీఎస్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బీటీపీఎస్‌ కింద భూములు కోల్పోయిన దమ్మక్కపేట సొసైటీలో 31 మంది, సాంబాయిగూడెం సొసైటీలో 38 మంది, సీతారాంపురం సొసైటీలో 33 మంది, పోతిరెడ్డిపల్లిలో మూడు సొసైటీలు కలిపి 253 మంది గిరిజన యువకులు సొసైటీల ద్వారా జీవనోపాధి పొందుతున్నారని, బీటీపీఎస్‌ బూడిద తరలించే బాధ్యత ఎక్కువ శాతం వీరికే అప్పగించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్‌ రాజ్‌, బీటీపీఎస్‌ సీఈ బిచ్చన్న, డీఈ మురళీకృష్ణ, ఎస్‌ఈ శ్రీనివాస్‌, శివచంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఐటీడీఏ పీఓ రాహుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement