
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
భద్రాచలంటౌన్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాపాడాలని సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట అన్నారు. పట్టణంలోని డిగ్రీ కళాశాల పక్కన కరకట్టపై గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మొక్క నాటి మాట్లాడుతూ గ్రీన్ భద్రాద్రి సంస్థ మరిన్ని పర్యావరణ హితమైన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అనంతరం జూనియర్ కళాశాల సెంటర్‌లోని షిరిడీ సాయిబాబా ఆలయాన్ని సందదర్శించి పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో గ్రీన్ భద్రాద్రి అధ్యక్షులు చిట్టె లలిత, పామరాజు తిరుమలరావు, పల్లింటి దేశప్ప, కామిశెట్టి కృష్ణార్జునరావు, గంగాధర వీరయ్య, బిర్రు సుధాకర్, రామరాజు, ఆలయ చైర్మన్ కొమ్మనాపల్లి ఆదినారాయణ, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, అబ్బినేని శ్రీనివాసరావు, గొర్ల వెంకటేశ్వరరావు, ఆర్‌ఐ నరసింహారావు పాల్గొన్నారు.
సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట
మొక్క నాటుతున్న సబ్ కలెక్టర్, తదితరులు