
‘రేడియో’లో రామానుజవరం విద్యార్థినులు
మణుగూరు రూరల్ : మండలంలోని రామానుజవరం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు గురువారం కొత్తగూడెం ఆకాశవాణి రేడియో కదంబ కార్యక్రమంలో పాల్గొని ప్రతిభ చూపారు. సుమారు గంట సేపు జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు పి.నిఖిత, జి.అక్షయ దివ్య, ఎస్‌కే. అస్రత్, ఎ.శ్రావణి, పి.పుష్పాంజలి, బి.మహిమతేజలు గురువులకు వందనాల పాట పాడారు. సెల్‌ఫోన్లతో కలిగే నష్టాలను తెలిపే కవితలను చదివారు. పొడుపుకథలు, కనువిప్పు నాటిక, జోకులు, ఐకమత్యమే మహాబలం ఆంగ్ల కథ, తెలుగునీతి పద్యాలు, నాకు నచ్చిన నాయకుడు అబ్దుల్ కలాం తదితర అంశాలను వివరించారు. విద్యార్థినులను, ప్రోత్సహించిన ఉపాధ్యాయులు వీవీ కోటేశ్వరరావు, జి.సురేష్‌లను పాఠశాల హెచ్‌ఎం యశోద అభినందించారు. కాగా రేడియో కార్యక్రమం ఈ నెల 21న మధ్యాహ్నం 12.40 గంటలకు కొత్తగూడెం ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుందని హెచ్‌ఎం తెలిపారు.