
మెరుగైన విద్యుత్ సేవలందిస్తాం
అశ్వారావుపేటరూరల్: వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ట్రాన్స్‌కో ఎస్‌ఈ జి. మహేందర్ తెలిపారు. మండలంలోని నారాయణపురం విద్యుత్ సబ్ స్టేషన్‌లో పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయ, గృహ వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. భవిష్యత్‌లో పోడు భూముల సాగుతో పెరిగే విద్యుత్ లోడ్‌కు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. నూతన ట్రాన్స్‌ఫార్మర్‌తో సబ్ స్టేషన్ పరిధిలో లోవోల్టేజీ సమస్య పరిష్కారం కావడంతోపాటు విద్యుత్ అంతరాయాలు తొలగిపోతాయని వివరించారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో డీఈ(ఆపరేషన్) నందయ్య, డీఈ(ఎంఆర్‌టీ) వెంకటేశ్వర్లు, ఏడీఈ వెంకట రత్నం, ఏడీఈ(టీఆర్‌ఈ) రాంబాబు, వినాయకపురం ఏఈ సంతోష్ పాల్గొన్నారు.