
ఇసుక అక్రమ నిల్వలు సీజ్
బూర్గంపాడు: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా సోంపల్లి గ్రామ సమీపంలో ఇసుకను నిల్వ చేశారు. మంగళవారం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వీర్రాజు పరిశీలించి, అనుమతులు లేకపోవడంతో సీజ్ చేశారు. అనుమతులు లేకుండా ఇసుకను నిల్వ చేస్తే శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
దుప్పిని గాయపర్చిన కుక్కలు
సత్తుపల్లి: సత్తుపల్లి మండలం నీలా ద్రి అర్బన్ పార్కు నుంచి జనావా సాల్లో వచ్చిన చుక్కల దుప్పిని వీధి కుక్కలు వెంటాడి గాయపరిచాయి. పార్కులో నుంచి మంగళవారం బయటకు వచ్చిన దుప్పి సింగరేణి ఓసీ మెయిన్‌గేట్ ప్రాంతానికి చేరింది. అక్కడ వీధికుక్కలు వెంట పడడంతో సింగరేణి సెక్యూరిటీ కుక్కల ను తరిమేశారు. అప్పటికే దుప్పి గాయపడడంతో ప్రాథమిక చికిత్స అనంత రం అటవీశాఖ అధికారులకు అప్పగించారు. కాగా, దుప్పిని రక్షించిన సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది విజేందర్, అయ్యప్ప, సుధాకర్, రామకృష్ణ, ప్రభాకర్, బాజిత్, జోసెఫ్‌ను పలువురు అభినందించారు.
మహిళకు జైలు శిక్ష
భద్రాచలంటౌన్: ఓ మహిళ మరో మహిళపై దాడి చేసి గాయపరిచిన కేసులో భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ వి.శివనాయక్ దాడి చేసిన మహిళకు జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. చర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన సోడి సుభద్రపై అదే గ్రామానికి చెందిన పూనెం రాధ దాడి చేసి గాయపరిచింది. సుభద్ర స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ ఎడాది ఏప్రిల్ 25న కేసు నమోదు చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. మంగళవారం కేసును విచారించిన న్యాయమూర్తి పూనెం రాధకు 6 నెలల జైలుశిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.